అధికారుల తీరుపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-02-23T05:42:30+05:30 IST

వైరాలో మంగళవారం సోమవరం క్లస్టర్‌ రైతు శిక్షణ సమావేశ మందిరం ప్రారంభోత్సవ సభలో కొంతమంది ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే రాములునాయ క్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అధికారుల తీరుపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అసంతృప్తి
ఆశావర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

 వైరా, ఏన్కూరులో రాములునాయక్‌, తాతా మధు పర్యటన

వైరా, ఫిబ్రవరి22: వైరాలో మంగళవారం సోమవరం క్లస్టర్‌ రైతు శిక్షణ సమావేశ మందిరం ప్రారంభోత్సవ సభలో కొంతమంది ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే రాములునాయ క్‌, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు వేదిక ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో రైతుల కంటే అధికంగా వైద్యా ఆరోగ్యశాఖకు చెందిన ఆశాకార్యకర్తలు ఎక్కువగా హాజరు కావడంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే, ఎమ్మెలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ అధికారులను రైతుబంధు నేతలను నిలదీశారు. రైతుల కార్యక్రమానికి ఆశావర్కర్లు తీసుకురావడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై పేర్లు ఉన్న ప్రతి ఒక్కరిని వ్యవసాయశాఖ అధికారులు విధిగా ఎందుకు ఆహ్వానించలేదని ఏడీఏ, ఏఓలను ప్రశ్నించారు. పదవులు పొంది బాధ్యతలను విస్మరిస్తే ఇకముందు సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా తమ పనితీరును మెరుగుపర్చుకోవాలని లేనట్లైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఆశావర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర మార్కెఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, రైతు బంధు జిల్లా కన్వీనర్‌ నల్లమల్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ వేల్పుల పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ మిట్టపల్లి నాగి, జిల్లా కమిటీ సభ్యుడు మచ్చా నర్సింహారావు, ఆత్మ ఛైర్మన్‌ ముత్యాల సత్యనారాయణ, ఏఎంసీ ఛైర్మన్‌ బీడీఏ రత్నం, మాజీ ఛైర్మన్‌ గుమ్మా రోశయ్య, కౌన్సిలర్లు డాక్టర్‌ దారెల్లి కోటయ్య, వనమా విశ్వేశ్వరరావు, ఏడీఏ వి. బాబురావు, ఏఓ ఎస్‌. పవన్‌కుమార్‌ పాల్గొన్నారు. 


ఏన్కూరుని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలి


ఏన్కూరు: అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల అందరూ సమన్వయంతో పనిచేసే మండలాన్ని అభివృద్ధి పధంలో నడిపించి ఏన్కూరు మండలాన్ని ఆదర్శమండలంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌ తెలిపారు. మంగళవారం ఏన్కూరు మండల ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆరెం వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో తాతా మధు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. రైతులను తలెత్తుకుని జీవించే విధంగా ఎదురు పెట్టుబడి రైతుబంధు ఇస్తూ రైతులకు అండగా సీఎం కే సీఆర్‌ నిలిచారని కొనియాడారు. అనతికాలంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు. Read more