పోడు సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలం

ABN , First Publish Date - 2022-10-01T05:15:14+05:30 IST

గిరిజనులు, అటవీశాఖాధికారుల మధ్య పోడువివాదాలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించడంలో పూర్తిగ విఫలమయ్యారని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్‌ ఆరోపించారు.

పోడు సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలం
వాగొడ్డుగూడెంలో పోడుదారులతో మాట్లాడుతున్న బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

 గిరిజనులపై దాడులు అమానుషం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌
అశ్వారావుపేట, సెప్టెంబరు 30:
గిరిజనులు, అటవీశాఖాధికారుల మధ్య పోడువివాదాలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించడంలో పూర్తిగ విఫలమయ్యారని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్‌ ఆరోపించారు. శుక్రవారం వాగొడ్డుగూడెంలోని పోడుసాగుదారులతో ఆయన సమావేశమై సంఘటగన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులకు బహుజన్‌ పార్టీ అండగ ఉంటుందని హామీ ఇచ్చారు. గిరిజనులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కరిస్తామంటూ మభ్యపెడుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే గిరిజనుడైనప్పటికి గిరిజనులపై దాడులు జరుగుతున్న స్పందించకపోవడం బాధాకరమన్నారు. పోడు ఘర్షణలను కవరేజ్‌ చేయడానికి వచ్చిన మీడియాపై కూడ అటవీశాఖాధికారులు దాడులు జరుపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గొల్లమందల పెంటయ్య, వెంకటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు.


Read more