కాలుష్య నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2022-11-27T22:14:41+05:30 IST

మణుగూరు బీటీపీఎ్‌సలో కాలుష్య నివారణకు రూ.400కోట్లతో ఆధునిక పరిజ్ఞానంతో ప్లూగ్యాస్‌ డిమో్‌స(ఎ్‌ఫజీడి) ప్లాంట్‌ నిర్మాణానికి జెన్కో యాజమాన్యం శ్రీకారం చుట్టింది. భద్రాధ్రి థర్మల్‌ పవర్‌స్టేషనతో ప్రభావిత గ్రామాల ప్రజలను కాలుష్యం కమ్మేస్తోంది.

కాలుష్య నివారణకు చర్యలు
ప్లాంట్‌ నిర్మాణాలకు భూమి పూజ చేస్తున్న డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌

బీటీపీఎస్‌లో రూ.400కోట్లతో ఎఫ్‌జీడీ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం

ప్రభావిత ప్రాంతాలకు తొలగనున్న కాలుష్య ముప్పు : సీఈ బిచ్చన్న

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

మణుగూరు రూరల్‌, నవంబర్‌ 27: మణుగూరు బీటీపీఎ్‌సలో కాలుష్య నివారణకు రూ.400కోట్లతో ఆధునిక పరిజ్ఞానంతో ప్లూగ్యాస్‌ డిమో్‌స(ఎ్‌ఫజీడి) ప్లాంట్‌ నిర్మాణానికి జెన్కో యాజమాన్యం శ్రీకారం చుట్టింది. భద్రాధ్రి థర్మల్‌ పవర్‌స్టేషనతో ప్రభావిత గ్రామాల ప్రజలను కాలుష్యం కమ్మేస్తోంది. యాష్‌ ప్లాంట్‌ నుంచి వెలువడే బూడిద ఎగిసి పడటం, కలుషిత బూడిద కలిసిన నీరుపారి పంట పొలాలు ధ్వంసం కావడం, ప్లాంట్‌ నుంచి వెలువడే కాలుష్యంతో సల్పర్‌ కార్భనడైఆక్సైడ్‌తో పాటు లోహలు వెలువడుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈనెల 6న ‘ఆంధ్రజ్యోతి’లో ‘కమ్మేస్తున్న కాలుష్యం’ అనే శీర్షికన వార్తను ప్రచురించింది. దీనిపై స్పందించిన టీఎస్‌ జెన్కో అధికార యంత్రాగం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపయోగించే అధునాతన పరికరాలను తీసుకొచ్చి బీటీపీఎస్‌ ప్లూగ్యాస్‌ డిమో్‌స(ఎ్‌ఫజీడి) ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి రూ.400కోట్ల నిధులు జెన్కో సంస్థ వెచ్చించగా బీహెచఈఎల్‌ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ ప్లాంట్‌కు జెన్కో సివిల్‌ డైరక్టర్‌ అజయ్‌కుమార్‌ శనివారం సాయంత్రం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ నిర్మాణం పూర్తయితే కాలుష్యాన్ని నియంత్రించడమే కాకుండా ప్లాంట్‌నుంచి వెలువడే సల్పర్‌ కార్భనడైక్సైడ్‌ను పూర్తిగా నివారిస్తుందని అధికారులు తెలిపారు. ప్రభావిత గ్రామాల ప్రజల పడుతున్న ఇబ్బందులను తెలుసకున్న సీఎండీ ప్రభాకర్‌రావు ఆధునిక కాలుష్య నివారణ యంత్రాలను ఇతర దేశాల నుంచి తె ప్పించి ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ప్లాంట్‌లో 1,080 మెగా వాట్ల నిర్మాణం చేపట్టగా ఒక్కో యూనిట్‌కు రూ.100కోట్ల చొప్పున నాలుగు యూనిట్లకు రూ.400కోట్లను వెచ్చించి ఎఫ్‌జీడీ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. బీటీపీఎస్‌ పరిసరాల్లో వాతావరణం కాలుష్యం కాకుండా ఈ ప్లాంట్‌ కాపాడుతుందని అధికారులు తెలిపారు.

ప్రభావిత గ్రామాలకు కాలుష్య ముప్పు ఉండదు

బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న

ఎఫ్‌జీడీ ప్లాంట్‌ నిర్మాణంతో బీటీపీఎస్‌ ప్రభావిత గ్రామాలకు కాలుష్య ముప్పు తగ్గుతుందని బీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజనీర్‌ బీచ్చన్న తెలిపారు. ఆదివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఆధునాతన పరిజ్ఞానంతో నిర్మించే ఈ ప్లాంట్‌తో పరిసర ప్రాంతాలపై కాలుష్య ప్రభావం ఉండదన్నారు. సీఎండీ ప్రభాకర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాలుష్య నివారణ ప్లాంట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-27T22:14:42+05:30 IST