తెరపైకి ఎల్‌ఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-07-06T04:33:03+05:30 IST

చాలారోజుల తర్వాత మళ్లీ భూముల క్రమబద్ధీకరణ అంశం తెరమీదకు వచ్చింది. అనధికారిక లే అవుట్లు, ప్లాట్లకు సంబంధించి రిజిసే్ట్రషన్లు చేయొద్దంటూ సర్క్యులర్‌ జారీ చేసిన రాష్ట్ర

తెరపైకి ఎల్‌ఆర్‌ఎస్‌

రిజిసే్ట్రషన శాఖకు డాక్యుమెంట్ల లింకు

మార్కెట్‌వాల్యూ అప్‌డేషన చేస్తున్న శాఖ

డాక్యుమెంట్ల ఆధారంగా 2020 నాటి రేట్లు

మూడు రోజుల పాటు సాగిన ప్రక్రియ

ఖమ్మం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): చాలారోజుల తర్వాత మళ్లీ భూముల క్రమబద్ధీకరణ అంశం తెరమీదకు వచ్చింది. అనధికారిక లే అవుట్లు, ప్లాట్లకు సంబంధించి రిజిసే్ట్రషన్లు చేయొద్దంటూ సర్క్యులర్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్లాట్లు, వెంచర్ల యజమానులు తమ భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. ఈ ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగంగా ప్లాట్లను దరఖాస్తుకు రూ.1,000, వెంచర్ల దరఖాస్తులకు రూ.10వేలు ఫీజుగా నిర్ధారించింది. లే అవుట్‌ ఆప్రూవల్‌ లేకుండా ప్లాట్లకు, ఇళ్లకు సంబంధించి కూడా సంబంధిత శాఖల అనుమతులు లేకుండా ఎలాంటి రిజిసే్ట్రషన్లు చేయొద్దంటూ గతేడాది ఆగస్టు 26న రాష్ట్ర రిజిసే్ట్రషన అండ్‌ స్టాంప్స్‌ ఐజీ ఉత్తర్వులు జారీ చేయగా దాదాపు నాలుగు నెలలపాటు పూర్తిస్థాయిలో రిజిసే్ట్రషన్లు నిలిచిపోయాయి. అనంతరం దానిపై వ్యతిరేకత రావడంతో మరికొద్ది రోజులకు అంటే అదే ఏడాది డిసెంబరు 29న సంబంధిత జీవోలో పలు సవరణలు చేస్తూ గతంలో రిజిసే్ట్రషన్లు ఉన్నవాటికి, గ్రామకంఠం పరిధిలో ఉన్న ఇళ్లకు సంబంధించి రిజిస్ర్టేషన్లు చేయొచ్చంటూ మరో సర్క్యులర్‌ జారీ చేశారు. అప్పటినుంచి నేటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు ఫీజు చెల్లించిన సంబంధిత దరఖాస్తుదారుల ప్లాట్లు మాత్రం రిజిసే్ట్రషన్లు జరగడంలేదు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై కొందరు రియల్టర్లు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టును ఆశ్రయించిన వారికి మాత్రం అవకాశం కల్పిస్తూ తీర్పు చెప్పింది. ఆ క్రమంలో కొందరికి రిజిసే్ట్రషన్లు జరగ్గా... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది జూన 18న సుప్రీంకోర్టు దానికి కూడా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారి రిజిసే్ట్రషన్లు కూడా ఆగిపోయాయి. 

రిజిసే్ట్రషన్ల శాఖకు డాక్యుమెంట్ల లింకు

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 25,59,652 దరఖాస్తులు రాగా వాటిల్లో ఉమ్మడి జిల్లా నుంచి 1,15,329 దరఖాస్తులు ఉన్నాయి. వాటిల్లో ఖమ్మం నగరపాలకం నుంచి 51,395, మధిర నుంచి 4304, సత్తుపల్లి నుంచి 3,677, వైరా నుంచి 3531, కొత్తగూడెం నుంచి 655, పాల్వంచ నుంచి 8809, ఇల్లెందు నుంచి 25 దరఖాస్తులు వచ్చాయి. వాటితోపాటుగా ఖమ్మంజిల్లాలో 248 పంచాయతీల నుంచి 37268 దరఖాస్తులు, కొత్తగూడెం జిల్లాలో 53 గ్రామపంచాయతీల నుంచి 5665 దరఖాస్తులు వచ్చాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన సంబంధిత ఎల్‌ఆర్‌ఎస్‌ డాక్యుమెంట్లను రిజిసే్ట్రషన్ల శాఖకు లింకు చేసింది. శాఖ సైట్‌లో ప్రత్యేకంగా ఎల్‌ఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ అప్‌డేషన మాడ్యూల్‌ను ఇచ్చి దానిద్వారా 2020మార్కెట్‌వాల్యూ అప్‌డేషన ఆఫ్షన్‌ను ఇచ్చింది. ఆయా ఫ్రొఫార్మాలో సంవత్సరాల వారీగా డాక్యుమెంట్లను సూచిస్తూ ఆయా డాక్యుమెంట్లలో ఉన్న భూమికి సంబంధించి 2020లో ఆ స్థలానికి ఉన్న మార్కెట్‌ విలును సవరించాలని సంబంధిత రిజిస్టార్లకు సూచించారు. దీంతో మూడు రోజులుగా ఈ ప్రక్రియ జరుగుతుండగా.. దీనికి మంగళవారం తుది గడువు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిసా్ట్రర్‌ కార్యాలయల్లో తక్కువ సమయంలో డాక్యుమెంట్ల అప్‌డేషన కార్యక్రమం జరుగుతుండటంతో రిజిసే్ట్రషన్ల శాఖ సర్వర్‌ నెమ్మదిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎక్కువ డాక్యుమెంట్లు ఉన్న కార్యాలయాల్లో ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆయా దరఖాస్తులకు సంబంధించి మార్కెట్‌వాల్యూ అప్‌డేషన చేసిన క్రమంలో సంబంధిత డాక్యుమెంట్లలో ఉన్న మార్కెట్‌ రేట్లు, 2020లో ఉన్న మార్కెట్‌ ధరలను బేరీజు వేసి సగటున ఫీజులు వసూలు చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. 

దరఖాస్తు దారుల్లో చిగురించిన ఆశలు..

ప్రభుత్వం.. అనుమతులు, లే అవుట్లు, ప్లాట్లకు సంబంధించిన రిజిసే్ట్రషన్లు నిలిపివేయడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. క్రయవిక్రయాల జరగని నేపథ్యంలో చాలామంది తమ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆయా ప్లాట్లను తాకట్టు పెట్టి ప్రైవేటులో ఫైనాన్స తీసుకున్నవారున్నారు. కొందరు రియల్టర్లు రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టి వెంచర్లు వేసి.. ల్యాండ్‌ కన్వర్షన అయిన తర్వాత రిజిసే్ట్రషన్లు కాకపోవడంతో అప్పుల పాలై ఆందోళన చెందుతున్నవారు ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దరఖాస్తులకు సంబంధించి మార్కెట్‌ వాల్యూ ని అప్‌డేషన చేస్తుండటంతో దరఖాస్తుదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. త్వరలో ప్రభుత్వం అందరికీ సానుకూలంగా ఉండే జీవో విడుదల చేస్తుందన్న చర్చ జరుగుతోంది. తమ ఇబ్బందులు గమనించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-06T04:33:03+05:30 IST