సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-24T04:43:54+05:30 IST

ప్రజలు నిత్యం ఎదుర్కొం టున్న సమస్యలపై స్పందిస్తూ ప్రజాపోరాటాలు నిర్మించ డం ద్వారా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని, ప్రజల కోసం పనిచేస్తే ఏ పార్టీకైన ప్రజాదరణ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం
మాట్లాడుతున్న కూనంనేని

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని 

చుంచుపల్లి, జనవరి 23: ప్రజలు నిత్యం ఎదుర్కొం టున్న సమస్యలపై స్పందిస్తూ ప్రజాపోరాటాలు నిర్మించ డం ద్వారా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్న ఏకైక పార్టీ సీపీఐ అని, ప్రజల కోసం పనిచేస్తే ఏ పార్టీకైన ప్రజాదరణ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. చుంచుపల్లి మండలం రాంనగర్‌లో ఆదివారం నూతన స భ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సం దర్భంగా గ్రామంలో పార్టీ శాఖా జెండాను కూనంనేని ఆవి ష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు భాగం మహేశ్వరరా వుతోపాటు మరో 50మందికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందచేశారు.   మహేశ్వరరావు నేతృత్వంలో పార్టీలో చేరిన పలువురు యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిం చా రు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ పార్టీ ఆవి ర్భావం నుంచి కార్మికులు, కర్షకులు, శ్రమజీవుల హక్కుల కోసం తొమ్మిది దశాబ్ధాలకు పైగా నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ సీపీఐనేనన్నారు.  పా లక ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాల వైపు నడిపి స్తున్నామని, సమసమాజ నిర్మాణం కోసం సోషలిజం, క మ్యూనిజం స్థాపనే ఽధ్యేయంగా పని చేస్తున్నామన్నారు.  కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజావ్యతిరేక విధానాలు, అవినీ తికర చర్యలను ఎండగట్టడమే లక్ష్యంగా సీపీఐ నిర్వహి స్తున్న పోరాటాల్లో ప్రజల భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ లక్ష్యమని అన్నారు. అందుకు విస్తృత పోరాటాలు నిర్వహిస్తామ న్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీర్‌ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటల గారడితో ఏడున్నరేళ్లుగా కాలం వెళ్లదీస్తోందన్నారు. ప్రజల ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి నిర్బంధాలకు పూనుకుంటోందని విమర్శించారు. సభ్యత్వం స్వీకరించిన వారిలో భాగం మహేశ్వరరావుతోపాటు అలీ మ్‌, లజయ్‌, వెంకట్‌, షఫీ, హబీద్‌, ఖదీర్‌, అప్పారావు, ఆ నంద్‌, వీరభద్రం, వేణు, మురళీ, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు దుగ్గిరాశి వెంకన్న, వై.శ్రీనివాస రెడ్డి, మండల కార్యదర్శి సలి గంటి శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ వట్టికొండ మల్లిఖార్జున రావు, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళీ, దమ్మాలపాటి శేషయ్య, సీహెచ్‌.మాధవరావు, వీరస్వామి, సర్పంచ్‌ బాణో త్‌ గోవింద్‌, ఎంపీటీసీ రాంబాబు, ఉపసర్పంచ్‌లు యాండ్ర మహేష్‌, పోలమూరి శ్రీనివాస్‌, రాంజీ, జనార్థన్‌ తదిత రులు పాల్గొన్నారు.


Read more