కొవిడ్‌ తగ్గినా.. కూయని రైలు

ABN , First Publish Date - 2022-03-17T04:27:51+05:30 IST

ఒక పక్క మధిర రైల్వే స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌ కోసం అనేక ఏళ్లుగా పోరాటం చేస్తుంటే రైల్వే అధికారులు మాత్రం కరోనా పేరుతో ఉన్న రైళ్లను ఉడబీకారు.

కొవిడ్‌ తగ్గినా.. కూయని రైలు
మధిర రైల్వే స్టేషన్‌

 కరోనా పేరుతో రైళ్ల రద్దు 

ప్రయాణికుల ఇబ్బందులు

కొత్త రైళ్ల కోసం పోరాటం చేస్తుంటే ఉన్న వాటిని రద్దుచేశారు

మధిరటౌన్‌, మార్చి 16: ఒక పక్క మధిర రైల్వే స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌ కోసం అనేక ఏళ్లుగా పోరాటం చేస్తుంటే రైల్వే అధికారులు మాత్రం కరోనా పేరుతో ఉన్న రైళ్లను ఉడబీకారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేఽశంతో పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. తదనంతరం కొవిడ్‌ తగ్గినా కొన్ని రైళ్లను పునరుద్దరించి గతంలో మఽధిరలో ఆగే పలు రైళ్లకు స్టాప్‌ లేకుండా చేశారు. సింహపురి ఎక్స్‌ప్రెస్‌, అండమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్స్‌ప్రెస్‌, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ లతో పాటు రెండు ప్యాసింజర్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేయగా పద్మావతి, లింక్‌ ఎక్స్‌ప్రెస్‌లకు విజయవాడ వైపు వెళ్లేందుకు హాల్ట్‌ ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు రద్దు చేశారు. దీంతో సంవత్సర కాలంగా ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగస్తు లు రైళ్ల రద్దు కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంగాలు, స్వశ్చంద సంస్థల ప్రతినిదులు మధిర స్టేషన్‌ మాష్టర్‌ వి. కాశిరెడ్డి కి వినతిపత్రాలు అందచేయగా వాటిని ఆయనపై అధికారులకు పంపినప్పటికినీ రైల్వే అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదు. గతంలో అనేక ఏళ్లగా మధిర లో నవజీవన్‌, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్‌ ఇవ్వాలని ఆందోళనలు చేయటమే కాకుండా రైల్వే అధికారులు, ప్రజాప్రతినిదులు, మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. కొత్త రైళ్లకు హాల్టింగ్‌ వస్తుంది అనుకుంటంటే ఉన్న రైళ్లను తీసివేయటం ఎమిటని ప్రజలు ప్రయాణికులు ప్రస్నిస్తున్నారు ఇప్పటికైనా రైల్వే అదికారులు స్పందించి రద్దుచేసిన రైళ్లను పునరుద్దరించాలని ప్రజలు కోరుతున్నారు. 


ఉన్న రైళ్లను తీసివేయటం అనాలోచిత చర్య: పుతుంబాక కృష్టప్రసాద్‌, ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు


గత అనేక సంవత్సరాలగా ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నవజీవన్‌, హౌరా వంటి రైళ్ల కోసం ఆందోళనలు చేస్తుంటే కరోనా పేరుతో ఉన్న రైళ్లను రద్దు చేయటం దుర్మార్గం, ప్రస్తుతం కరోనా పూర్తిగా తగ్గినందున రైళ్లను తిరిగి మధిరలో ఆపాలి. 


సమస్యను ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్తా: వి. కాశిరెడ్డి, స్టేషన్‌ మాష్టర్‌


కరొనా ప్రయాణికులకు ఒకరి ద్వారా మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని కొవిడ్‌ సెకండ్‌వేవ్‌లో కొన్ని రైళ్లను రద్దు చేశారు, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.  


Read more