నేటి నుంచి కోలిండియాస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీ

ABN , First Publish Date - 2022-11-30T00:07:55+05:30 IST

కోలిండియా లెవల్‌ ఇంటర్‌లెవల్‌ కంపెనీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సింగరేణి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ప్రకాశంగ్రౌండ్‌లో బుధవారం నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు

నేటి నుంచి కోలిండియాస్థాయి ఫుట్‌బాల్‌ టోర్నీ

రుద్రంపూర్‌, (సింగరేణి) నవంబరు 29: కోలిండియా లెవల్‌ ఇంటర్‌లెవల్‌ కంపెనీ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు సింగరేణి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని ప్రకాశంగ్రౌండ్‌లో బుధవారం నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించనున్నట్లు సింగరేణి జనరల్‌మేనేజరు (పర్సనల్‌) కే. బసవయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోలిండియా పరిధిలోని తొమ్మిది టీంలు పోటీల్లో పాల్గొంటాయని ప్రకటించారు. బొగ్గు కంపెనీల్లో ఇంటర్‌ కంపెనీ పుట్‌బాల్‌ టోర్నమెంట్‌ 34వ కోలిండియా పోటీలను నిర్వహించేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సింగరేణి సీఎండీ ఎన. శ్రీధర్‌, డైరెక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ (ఫైనాన్స) బలరాం, డైరెక్టర్‌ ఈఅండ్‌ఎం సత్యనారాయణరావు, గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు బి. వెంకటరావు, ప్రాతినిధ్య సంఘం కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యలు హజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో సింగరేణి సెక్యూరిటీ అధికారి హనుమంతరావు, సీనియర్‌ పీవో సుశీల్‌కుమార్‌, అవినాష్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్లు సుందర్‌రాజు, ఎంసీ. పాస్‌నెట్‌, జానవెల్సీ, అశోక్‌, శ్రీనివాస్‌, రమేష్‌తోపాటు ఇతర కంపెనీలకు సంబంధించిన క్రీడా మేనేజర్లు, సూపర్‌వైజర్లు హజరవుతారని తెలిపారు.

Updated Date - 2022-11-30T00:08:11+05:30 IST

Read more