కమ్మవారు కలిసికట్టుగా సాగాలి

ABN , First Publish Date - 2022-11-20T23:30:48+05:30 IST

కమ్మవారంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.

కమ్మవారు కలిసికట్టుగా సాగాలి
మంత్రిని సన్మానిస్తున్న నిర్వాహాకులు

వైరా, నవంబరు 20: కమ్మవారంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. వైరా కమ్మజన సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం కొల్లి శ్రీనివాసరావు మామిడితోటలో కార్తీకమాస వనసమారాధనను నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, ఖమ్మం మేయర్‌ పునుకుళ్ల నీరజ, అడిషనల్‌ డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌తో పాటు స్థానికులైన చింతనిప్పు సుధాకర్‌, ఏనుగు హన్మంతరావు దంపతులు తదితరులు పాల్గొని వనదేవతలకు పూజలు చేశారు. ఆతర్వాత వనసమారాధనను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ, అడిషనల్‌ డీసీపీ సుభాష్‌చంద్రబోస్‌, రాయల శేషగిరిరావు, కొండబాల, నీరజను కమిటీ నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ శ్రీరామనేని రామస్వామి, దిశ కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్‌రావు, కమ్మజన సేవాసమితి సెక్రటరీ చింతనిప్పు రాంబాబు, జక్కంపూడి కృష్ణమూర్తి, గుత్తా వెంకటేశ్వరరావు, సూర్యదేవర శ్రీధర్‌, చింతనిప్పు మురళీ, పొదిల హరినాథ్‌, అడపా రామకోటయ్య, డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, కర్నాటి హన్మంతరావు, గింజుపల్లి జనార్థన్‌, బెజవాడ నాగేశ్వరరావు, వీరభద్రం, చెరుకూరి కిరణ్‌ పాల్గొన్నారు. అనంతరం వనసమారాధన నిర్వహించారు.

Updated Date - 2022-11-20T23:30:48+05:30 IST

Read more