న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైనది

ABN , First Publish Date - 2022-12-06T23:13:50+05:30 IST

అన్ని రంగాల్లోకన్నా న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైనదని మణుగూరు ప్రధమశ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎం వెంకటేశ్వర్లు అన్నారు.

 న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైనది
మాట్లాడుతున్న మెజిస్ర్టేట్‌ వెంకటేశ్వర్లు

మణుగూరుటౌన్‌, డిసెంబరు 6: అన్ని రంగాల్లోకన్నా న్యాయవాద వృత్తి ఎంతో ఉన్నతమైనదని మణుగూరు ప్రధమశ్రేణి జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మణుగూరు కోర్టు ఆవరణలో ఆ ల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌, మణుగూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వ్వర్యంలో ‘‘యువ న్యాయవాదుల ఎదుట సవాళ్లు’’ అన్న అంశంపై జరిగిన సెమినార్‌లో మెజిస్ట్రేట్‌ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ వాదులు కోర్టు అధికారులని, కోర్టు సబ్‌ ఆర్డినేట్‌లు కాదన్నారు. కక్షిదారులకు న్యాయం చేయడంలో న్యాయవాదులు ఉన్నతంగా వ్యవహరించాలని, ఆ మేరకు బార్‌ అండ్‌ బెంచ్‌ సంబంధాలను కొనసాగించాలన్నారు. అనంతరం ఐలు సభ్యులు, కొత్తగూడెం సీనియర్‌ న్యాయవాది రమేష్‌ కుమార్‌ మక్కడ్‌ యువ న్యాయవాదులు ఎదుట సవాళ్లు అనే అంశంపై క్లుప్తంగా మణుగూరు జూనియర్‌ న్యాయవాదులకు అవగాహన కల్పించారు. కోర్టులో కేసులను రిప్రంజెంటేషన్‌ చేసేటప్పుడు ఎదుటి లాయర్లను గౌరవించాలని సూచించారు.

Updated Date - 2022-12-06T23:13:54+05:30 IST