కిష్టాపురం జ్యూయలరీ షాప్‌లో నగలు చోరీ

ABN , First Publish Date - 2022-03-17T04:51:58+05:30 IST

ఓ నగల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆభరణాలు చోరీ చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని కిష్టాపురంలో చోటుచేసుకుంది. బాధితులు దోసపాటి మల్లికార్జునరావు, వంకదారు మధు వివరాల ప్రకారం..

కిష్టాపురం జ్యూయలరీ షాప్‌లో నగలు చోరీ

సత్తుపల్లిరూరల్‌, మార్చి16: ఓ నగల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆభరణాలు చోరీ చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండలంలోని కిష్టాపురంలో చోటుచేసుకుంది. బాధితులు దోసపాటి మల్లికార్జునరావు, వంకదారు మధు వివరాల ప్రకారం.. హిమబిందు జ్యూయలరీ షాప్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. షాపులోని నాలుగు తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. సుమారు రూ.9లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఎస్‌కే.షాకీర్‌ తన బృందంతో షాపుకు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more