బాలికపై లైంగికదాడి కేసులో 20ఏళ్ల జైలుశిక్ష

ABN , First Publish Date - 2022-02-19T05:57:39+05:30 IST

బాలికపై లైంగికదాడి కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన పూనెంముత్తయ్యకు 20సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి.

బాలికపై లైంగికదాడి కేసులో 20ఏళ్ల జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌ ఫిబ్రవరి 18: బాలికపై లైంగికదాడి కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన పూనెంముత్తయ్యకు 20సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. దుమ్ముగూడెం మండలం అచ్చుతాపురానికి చెందిన ఫిర్యాది 2018 ఆగస్టు 26న తన కూతురుని అంగనవాడీ కేంద్రానికి పంపి వ్యవసాయ పనులకు వెళ్లింది. పాప అంగనవాడీ కేంద్రం నుంచి ఇంటికి వచ్చి తమ ఇంటి ముందు ఆడుకుంటుండగా గమనించిన నిందితుడు పాపను తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లి దుమ్ముగూడెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదుచేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడు నేరం రుజువు కావడంతో నిందితుడు మత్తయ్యకు 20 సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వులు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరుపున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొత్తావెంకటేశ్వరరావు వాదించగా, లైజన్‌ ఆఫీసర్‌ జి.ముత్తయ్య, కోర్టు కానిస్టేబుల్‌ సురేష్‌, హోంగార్డు ఎండి. ఆయ్యూబ్‌ సహకరించారు.


Read more