రైల్వే స్టేషన్‌లో తాగు నీరు కూడా ఉండదా?: నామా

ABN , First Publish Date - 2022-12-30T03:45:28+05:30 IST

రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కూడా ఉండదా

రైల్వే స్టేషన్‌లో తాగు నీరు కూడా ఉండదా?: నామా

ఖమ్మం మామిళ్లగూడెం, డిసెంబరు 29 : రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు తాగునీటి సౌకర్యం కూడా ఉండదా? అని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఖమ్మం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు కల్పించటం లేదని మండిపడ్డారు. ఖమ్మం స్టేషన్‌లో మూసి ఉన్న ‘సుజల్‌’ నీటి స్టాల్‌ను పరిశీలించారు. ఫ్లాట్‌ఫారాలపై బండలు పగిలినా, సక్రమంగా లేని డ్రెయినేజీ వ్యవస్థ, భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాల గురించి తాను రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించినా పట్టించుకోవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-30T03:45:28+05:30 IST

Read more