ఎస్‌ఎ్‌సపీలో కో ఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-12-10T00:11:21+05:30 IST

సమగ్ర శిక్ష ప్రాజెక్టు జిల్లా కార్యాలయంలో కో ఆర్డినేర్టుగా పనిచేయాడానికి ఆసక్తి గల హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో సోమశేఖర్‌ శర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎస్‌ఎ్‌సపీలో  కో ఆర్డినేటర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

డీఈవో సోమశేఖర్‌శర్మ

కొత్తగూడెం కలెక్టరేట్‌, డిసెంబరు 9: సమగ్ర శిక్ష ప్రాజెక్టు జిల్లా కార్యాలయంలో కో ఆర్డినేర్టుగా పనిచేయాడానికి ఆసక్తి గల హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో సోమశేఖర్‌ శర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈనెల 10వ తేదీ నుంచి 17 వరకు అందజేయాలన్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు జిల్లా, రాష్ట్ర కార్యాలయాల్లో వివిధ కో ఆర్డీనేటర్లుగా ఫారిస్‌ సర్వీ్‌సపై పనిచేయుటకు వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్రాత పరీక్ష జనవరి మొదటి వారంలో ఉంటుందన్నారు. పరీక్ష రుసుము రూ..600 చెల్లించాలన్నారు.

Updated Date - 2022-12-10T00:11:27+05:30 IST