సీఎం స్పందించకపోతే పోరాటమే

ABN , First Publish Date - 2022-01-03T05:53:51+05:30 IST

ప్రభుత్వ నిర్వహణలో ఎంతో కీలక పాత్ర పోషించే రాష్ట్రంలోని 3.5లక్షల మంది ఉద్యోగులను గందరగోళంలో పడేలా సీఎం కేసీఆర్‌, చీఫ్‌ సెక్రటరీ సోమేశకుమార్‌ 317జీవోను రూపొందించారని, వెంట

సీఎం స్పందించకపోతే పోరాటమే
మాట్లాడడుతున్న సీఎల్‌పీ నాయకులు, ఎమ్మెల్యే భట్టి

ఉద్యోగులకు అండగా సీఎల్పీ 

317 జీవోను వెంటనే రద్దు చేయాలి

విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి

ఖమ్మంసంక్షేమవిభాగం, జనవరి 2: ప్రభుత్వ నిర్వహణలో ఎంతో కీలక పాత్ర పోషించే రాష్ట్రంలోని 3.5లక్షల మంది ఉద్యోగులను గందరగోళంలో పడేలా సీఎం కేసీఆర్‌, చీఫ్‌ సెక్రటరీ సోమేశకుమార్‌ 317జీవోను రూపొందించారని, వెంటనే ఆ జీవోను రద్దు చేయకపోతే పోరాటం చేస్తామని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించచారు. ఆదివారం ఖమ్మంలో ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులకు సీఎల్పీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాష్ట్ర సాధన ఉద్యమంలో 42రోజులు పాటు ఉద్యోగులు, వారి కుటుంబాలు నిరసనలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఉద్యోగుల సంక్షేమం, నూతన ఉద్యోగాల కోసమే అప్పటి తమ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. అలాంటి ఉద్యోగులపై కక్ష సాధించి.. వారిని  భయభ్రాంతులకు గురి చేసి భవిష్యతలో తనకు అనుకూలంగా మార్చుకునేందుకే 317 జీవోని రూపొందించారని ఆరోపించారు. భార్యాభర్తలు కలిసి ఒకే ప్రాంతంలో పనిచేసే హక్కు ఉందని, ఉద్యోగుల పిల్లలు అనారోగ్యంతో ఉండటం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగుల సంక్షేమ సంఘాల నాయకులు ఉద్యోగుల కోసం పనిచేయాలని, ప్రభుత్వ పక్షాన ఉండకూడదని హితవు పలికిన భట్టి.. 317 జీవో ప్రభావం జీడీపీపై పడుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నగర అధ్యక్షుడు ఎండీ జావీద్‌, నాయకులు రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, పుచ్చకాయల వీరభద్రం, యడ్లపల్లి సంతోష్‌, శేఖర్‌గౌడ్‌, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Read more