ఆరోగ్యకరమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-11T06:40:31+05:30 IST

ఆరోగ్యకరమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం

ఆరోగ్యకరమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి అజయ్‌, కలెక్టర్‌ గౌతమ్‌

గురుకులాలు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలి

ఖమ్మంలో ‘స్వచ్ఛ గురుకులం’లో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మంసంక్షేమవిభాగం, సెప్టెంబరు 10: ఆరోగ్యకరమైన విద్యను అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రభుత్వ స్వచ్ఛ గురుకులాల వారోత్సవాలను చేపట్టిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని సాంఘిక సంక్షేమ గురుకులం ‘స్వచ్ఛగురుకులం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులంలోని వంటశాల, సామగ్రి గదులు, హాస్టల్‌ పరిసరాలను మంత్రి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి పువ్వాడ, కలెక్టర్‌ గౌతమ్‌ భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా గురుకులాల విద్యార్థులు టైపాయిడ్‌, మలేరియా, డెంగ్యూ, డయేరియా, ఫుడ్‌పాయిజనింగ్‌, వైరల్‌ జ్వరాల బారినపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థుల కోసం ‘స్వచ్ఛగురుకులం’ వారోత్సవాలు ఏర్పాటు చేసిందన్నారు. గురుకులాల పరసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లి దండ్రులు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల విద్యావ్యవస్థలను రూపొందించిందన్నారు. అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్వచ్చ స్పూర్తి నిత్యం కొనసాగించాలన్నారు. ఇంటి నుంచి గురుకులానికి విద్యార్థులు వచ్చే సమయంలో తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. విద్యార్థులకు 24గంటల పాటు వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్‌ గౌతమ్‌, మేయర్‌ పునకొల్లు నీరజ, కమిషనర్‌ ఆదర్శ్‌సురబి, జాయింట్‌ సెక్రటరీ శారద, అసిస్టెంట్‌ శిక్షణ కలెక్టర్‌ రాధిక గుప్తా, ఆర్‌సీవో ప్రత్యూష, ఏఆర్‌సీవో పాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T06:40:31+05:30 IST