స్టేడియంఅగ్రిమెంట్‌ వెంటనే చేయండి

ABN , First Publish Date - 2022-10-01T04:26:23+05:30 IST

వైరా మునిసిపాలిటీ పట్టణ ప్రగతిలో భాగంగా క్రీడాప్రాంగణం నిర్మాణానికి మంజూరైన రూ.80లక్షల నిధులకు సంబంధించి వెంటనే అగ్రిమెంట్‌ చేయాలని ఖమ్మం పీఆర్‌ ఈఈ పి.శ్రీనివాస్‌ను జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఆదేశించారు.

స్టేడియంఅగ్రిమెంట్‌ వెంటనే చేయండి
ఇండోర్‌ స్టేడియం వద్ద కూరగాయల మార్కెట్‌ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత

పనుల్లో జాప్యంపై కలెక్టర్‌ గౌతమ్‌ ఆగ్రహం

వైరా, సెప్టెంబరు 30: వైరా మునిసిపాలిటీ పట్టణ ప్రగతిలో భాగంగా క్రీడాప్రాంగణం నిర్మాణానికి మంజూరైన రూ.80లక్షల నిధులకు సంబంధించి వెంటనే అగ్రిమెంట్‌ చేయాలని ఖమ్మం పీఆర్‌ ఈఈ పి.శ్రీనివాస్‌ను జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఆదేశించారు. శుక్రవారం వైరా మునిసిపాలిటీలో జిల్లా అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలితో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. వైరా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలోని మూడెకరాల ఖాళీ స్థలంలో రూ.80 లక్షలతో చేపట్టిన స్టేడియం నిర్మాణం గురించి కలెక్టర్‌ పీఆర్‌ అధికారులను ప్రశ్నించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఇంకా అగ్రిమెంట్‌ చేయలేదని దాంతో నిర్మాణం ప్రారంభించలేదని సదరు కాంట్రాక్టర్‌ కలెక్టర్‌కు చెప్పడంతో అగ్రిమెంట్‌ జాప్యంపై పీఆర్‌ ఈఈని ప్రశ్నించారు. వెంటనే అగ్రిమెంట్‌ చేయాలని ఆదేశించారు. మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, కమిషనర్‌ ఎన్‌.వెంకటప తిరాజు, జడ్పీ సీఈవో వీవీ.అప్పారావు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ కస్తాల సత్యనారాయణ, డీఎంహెచ్‌వో మాలతీ, తహసీల్దార్‌ ఎన్‌.అరుణ కలెక్టర్‌ వెంట ఉన్నారు. 

Read more