పార్వతీ పుత్ర.. గంగా యాత్ర

ABN , First Publish Date - 2022-09-11T05:04:23+05:30 IST

తొమ్మిది రోజులు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు.

పార్వతీ పుత్ర.. గంగా యాత్ర
ముదిగొండలో వినాయక విగ్రహ ఊరేగింపు

కన్నులపండువగా గణేష్‌ నిమజ్జనం

భక్తుల నృత్యాల మధ్య శోభాయాత్ర

నెట్‌వర్క్‌: తొమ్మిది రోజులు పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. డప్పు చప్పుళ్లు, నృత్యాలతో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరాగా డప్పులు, మేళతాళాలు, బాణాసంచా పేలుళ్లతో పట్టణాలు, మండలాలు, గ్రామాలు మార్మోగాయి కోలాట నృత్య ప్రదర్వనలు ఆకట్టుకున్నాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయయ తల్లాడ, సత్తుపల్లిలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ ఏన్కూరులో అన్నదానం నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. క్రేన్‌ల సహాయంతో, గత ఈతగాళ్ల సమక్షంలో గణపతులను నిమజ్జనం చేశారు. సత్తుపల్లి ప్రసన్నగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను వంగరి రాకేష్‌ అనే వ్యక్తి రూ.3.61 లక్షలకు దక్కించుకున్నారు. కారేపల్లిలో వెంక ట్యా తండాలో జరిగిన లడ్డూ వేలంపాటలో బాదావత్‌ రాము పాల్గొని రూ.13 వేలకు దక్కించుకున్నాడు.

Read more