ఉచిత శిక్షణ, ఉపాధి

ABN , First Publish Date - 2022-04-06T04:42:43+05:30 IST

సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కలిపించ నున్నట్టు సంస్థ శిక్షణ అధికారి జి.జయలక్ష్మి తెలిపారు.

ఉచిత శిక్షణ, ఉపాధి

ఖమ్మంచర్చికాంపౌండ్‌, ఏప్రిల్‌5: సెంట్రల్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కలిపించ నున్నట్టు సంస్థ శిక్షణ అధికారి జి.జయలక్ష్మి తెలిపారు. మంగళవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యవత, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీప ఈబీసీ , అంగవైకల్యం, అగ్రవర్ణ పేదలకు ఈ శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సున్న వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

Read more