రక్షణ కల్పిస్తేనే విధులకు

ABN , First Publish Date - 2022-11-24T23:39:09+05:30 IST

తమకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించిన తర్వాతే విధులకు హాజరవుతామని, అప్పటి వరకు కేవలం కార్యాలయాలకు వచ్చి వెళ్తామని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

రక్షణ కల్పిస్తేనే విధులకు
డీఎఫ్‌వోకు వినతిపత్రం అందిస్తున్న ఎఫ్‌ఆర్వోల, డీఆర్వోలు, అటవీ ఉద్యోగులు

పోడు సర్వే, గ్రామసభలను బహిష్కరించిన ఫారెస్టు సిబ్బంది

ఖమ్మంలో అటవీ ఉద్యోగుల నిరసన ర్యాలీ

ఖమ్మం సంక్షేమవిభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 24: తమకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించిన తర్వాతే విధులకు హాజరవుతామని, అప్పటి వరకు కేవలం కార్యాలయాలకు వచ్చి వెళ్తామని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావును హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణకు ఆయుధాలు, వాహనాలు కేటాయించాలని ఫారెస్టుస్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇరు జిల్లాల్లో గురువారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆందోళనలు నిర్వహించారు. ఖమ్మంలోని జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జిల్లాలోని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ధర్నా చేయగా డీఎ్‌ఫవో సిద్ధార్థవిక్రమ్‌ సింగ్‌ వారి వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల సంఘాల బాధ్యులు చక్రవర్తి, రాధిక, డీ శ్రీనివాసరావు, విజయ్‌కుమార్‌ ఆయనకు క్షేత్రస్థాయిలో అటవీశాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శ్రీనివాసరావు హత్య పథకం ప్రకారమే జరిగిందని, నిందితులను అటవీశాఖ ఉద్యోగులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే పోలీసులు తామే పట్టుకున్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శ్రీనివాసరావు హత్య ఘటనలో 30మంది ముఠా పాల్గొన్నదని, శ్రీనివాసరావును నేలపై పడుకొబెట్టి కాళ్లు చేతులు పట్టుకొని కిరాతకంగా నరికారని ఆరోపించారు. ఆర్వోఎ్‌ఫఆర్‌ చట్టాన్ని ఉన్నతాధికారులు అమలు చేయటం లేదని, క్షేత్రస్థాయిలో పోడు సాగుదారుల ఎదుట అటవీశాఖ అధికారులను దోషులుగా నిలబెడుతున్నారని ఆరోపించారు. అటవీశాఖ ప్రమేయం లేకుండానే పంచాయతీల కార్యదర్శలు సర్వేలు నిర్వహిస్తూ తమపై ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. అనంతరం డీఎప్వో కార్యాలయం నుంచి ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. భవిష్యతలో తమ ఉద్యమం రాష్ట్రస్థాయికి చేరుతుందన్నారు. నిరసన కార్యక్రమంలో కార్యాలయాల పర్యవేక్షకులు కృష్ణారావు, వెంకటేశ్వరరావు, ఎఫ్‌ఆర్‌వోలు విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, డీఆర్వోలు లక్ష్మీపతి, రవికుమార్‌, సీతారామారావు, సుప్రియ, అసోసియేషన నాయకులు డీ శ్రీను, రవికుమార్‌, సురేశకుమార్‌, నాగరాజు పాల్గొన్నారు. ఇక భద్రాద్రి జిల్లాలోనూ అటవీ సిబ్బంది పోడుసర్వే, ఎఫ్‌ఆర్‌సీ కమిటీ గ్రామ సభలను బహిష్కరించారు. విధినిర్వహణలో తమకు రక్షణ కరువైందని, గొత్తికోయల చేతిలో మృతి చెందిన సీహెచ శ్రీనివా్‌సరావు భార్యకు అతడి క్యాడర్‌కు సమానంగా గెజిటెడ్‌ ఉద్యోగం ఇవ్వాలని, ఆయన కుటుంబానికి రూ.50కోట్లు నష్టపరిహారం, జిల్లా కేంద్రంలో 500గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా ఫారెస్టు రేంజ్‌ అధికారుల అసోసియేషన అధ్యక్షుడు సీహెచ శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తక్షణమే తమకు ఆయుధాలు సరఫరా చేయాలని, ఫారెస్టు స్టేషన ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం కూడా తమ నిరసనలు కొనసాగుతాయని, కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లనున్నట్లు వెల్లెడించారు.

Updated Date - 2022-11-24T23:39:09+05:30 IST

Read more