30లోపు పన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ

ABN , First Publish Date - 2022-04-06T04:41:59+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఆస్తిపన్నులను ఈనెల 30లోపు చెల్లించిన వారికి ఇంటిపన్ను మొత్తంలో 5శాతం రాయితీ ఇస్తామన నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి ఒక ప్రకటనలో తెలిపారు.

30లోపు పన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ

ఖమ్మంకార్పొరేషన్‌, ఏప్రిల్‌5: ఈ ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఆస్తిపన్నులను ఈనెల 30లోపు చెల్లించిన వారికి ఇంటిపన్ను మొత్తంలో 5శాతం రాయితీ ఇస్తామన నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం కేవలం ఈ ఆర్ధిక సంవత్సరానికి పన్నులు చెల్లించేవారికి మాత్రమే ఉంటుందన్నారు. పాతబకాయిలు ఉన్నవారికి రాయితీ సౌకర్యం ఉండదని కమిషనర్‌ పేర్కొన్నారు. కేవలం 2022-23 ఆర్ధిక సంవత్సరానికి పన్నులు చెల్లించేవారికి మాత్రమే 5శాతం రాయితీ ఉంటుందన్నారు.

Read more