ఘనంగా సైన్స్‌ఫేర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-25T00:13:53+05:30 IST

జిల్లా సైన్స్‌ ఫేర్‌ ఘనంగా ప్రారంభమైంది. గురువారం ఇల్లందు పట్టణంలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన జిల్లా పాఠశాలల విద్యా, వైజ్ఙానిక ప్రదర్శనలో మండలాల నుంచి విద్యార్థులు 674 ఎగ్జిబిట్‌లతో వచ్చారు.

ఘనంగా సైన్స్‌ఫేర్‌ ప్రారంభం
టెంట్ల కింద ప్రదర్శనల ఏర్పాటు

ఇల్లెందు, నవంబరు 24: జిల్లా సైన్స్‌ ఫేర్‌ ఘనంగా ప్రారంభమైంది. గురువారం ఇల్లందు పట్టణంలోని సింగరేణి కాలరీస్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన జిల్లా పాఠశాలల విద్యా, వైజ్ఙానిక ప్రదర్శనలో మండలాల నుంచి విద్యార్థులు 674 ఎగ్జిబిట్‌లతో వచ్చారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన దానికంటే అధికంగా గిరిజన మండలాల విద్యార్థులు ఉపాధ్యాయులు జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌ ఎగ్జిబిట్లతో తరలిరావడం గమనార్హం. జూనియర్స్‌ విభాగంలో 235 ఎగ్జిబిట్లు, సీనియర్స్‌ విభాగంలో 431 ఎగ్జిబిట్లు, ఉపాధ్యాయుల విభాగంలో ఎనిమిది ఎగ్జిబిట్లు వచ్చాయి. అంచనాలకు మించి ఎగ్జిబిట్లకు విద్యార్ధులు, ఉపాధ్యాయులు తీసుకురావడంతో సిం గరేణి పాఠశాల గదులు చాలక, ప్రత్యేకంగా టెంట్లు వేసి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన విద్యార్ధులు, ఉపాధ్యాయులు తమ తమ ఎగ్జిబిట్లను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు విద్యాశాఖాధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. బాలికలకు ఐటీడీఏ యు వజన శిక్షణ కేంద్రం, వైటీసీలో, బాలురకు సంక్షేమ వసతిగృహాల్లో వసతి సౌకర్యం కల్పించారు.

కోలాహాలంగా జేకే కాలనీ ఏరియా

జిల్లా సైన్స్‌ఫేర్‌ సందర్భంగా ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీ కోలాహలంగా మారింది. ఎగ్జిబిట్లతో విద్యారులు, ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో విద్యార్థులతో ్థమెయిన్‌ రోడ్డు కిక్కిరిసింది. ప్రారంభ వేడుకలను సైతం సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సైన్స్‌ఫేర్‌లో అసౌకర్యాలకు తావు లేకుండా విద్యాశాఖతో పాటు, హరిప్రి య ఫౌండేషన్‌, సింగరేణి కాలరీస్‌ యాజమాన్యం సహకారాలు అందిస్తున్నాయి.

Updated Date - 2022-11-25T00:13:53+05:30 IST

Read more