కొత్త ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం

ABN , First Publish Date - 2022-11-24T23:36:23+05:30 IST

కొత్త ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, 2023 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం వచ్చిన ఆయన కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి జిల్లాలోని వీఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు.

కొత్త ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం
ఓటరు జాబితాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

జాబితా సవరణలో జాగ్రత్తలు పాటించాలి

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

ఖమ్మం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : కొత్త ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, 2023 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం వచ్చిన ఆయన కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి జిల్లాలోని వీఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఓట్ల తొలిగింపు విషయంలో సంబంధిత కుటుంబీకుల్లో ఒకరి నుంచి ఫామ్‌-7పై సంతకం తీసుకున్న తర్వాతే తొలగించాలని, వలస వెళ్లిన ఓటర్ల తొలిగింపులోనూ ఏదైనా ధ్రువీకరణ ఉంటేనే చేయాలని, డబుల్‌ ఎంట్రీల తొలగింపులోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్లపై సమీక్ష చేయాలన్నారు. డెమోగ్రాఫికల్‌గా ఒకేలా ఉన్న నమోదుపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ కళాశాల, పాఠశాల స్థాయిలో ఒక ప్రతినిధిని నియమించి అర్హులైన వారిని గుర్తించి ఓటర ్లజాబితాలో చేర్చేలా చొరవ తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రీ రివిజన్‌ యాక్టివిటీ చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో 1,416 పోలింగ్‌ కేంద్రాలుండగా, కొత్తగా 23 కేంద్రాలను ప్రతిపాదించామని, 43కేంద్రాల్లో లొకేషన మార్పుచేశామని, మొత్తం 1,439 పోలింగ్‌ కేంద్రాలకు బూతలెవల్‌ అధికారులను నియమించామన్నారు. ఓటరు జాబితా సవరణ జిల్లాలో పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు చేర్పులపై రూపొందించి అవగాహన పోస్టర్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి ఆవిష్కరించారు. ఈ సమవేశంలో అదనపు కలెక్టర్లు ఎన.మధుసూదన, స్నేహలత, మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శసురభి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్‌, తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్లు బూతలెవల్‌లో సమీక్షించాలి

ఖమ్మం కార్పొరేషన : ఓటరు జాబితా ప్రత్యేక సవరణలపై తహసీల్దార్లు ప్రతీవారం బూతలెవల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికా్‌సరాజ్‌ సూచించారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌తో కలిసి గురువారం ఆయన ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఖమ్మం రూరల్‌మండలంలోని జలగంనగర్‌, తల్లంపాడు ఉన్నతపాఠశాలలను సందర్శించి అక్కడి పోలింగ్‌బూతలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రక్రియ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. తహసీల్దార్లు ప్రతీవారం బూతలెవల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించాలని, కళాశాలల నుంచి ఓటరు నమోదు కోసం వచ్చిన ధరఖాస్తులు, సంబంధిత చిరునామా వివరాలను ఆయా మండలాల అధికారులకు పంపాలన్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ మహిళా డిగ్రీకళాశాలను సందర్శించి విద్యార్ధినులకు ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన ఓటును అమ్ముకోవద్దు అనే లఘుచిత్రం ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమాల్లో నగరపాలకసంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, అదనపు

కలెక్టర్‌ మధుసూదన, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మావతి, ఆర్డీవో రవీంధ్రనాథ్‌, ఎస్టీసీ దశరథం, జిల్లా ఉపాధికల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్‌, తహసీల్దార్లు శైలజ, సుమ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:36:23+05:30 IST

Read more