స్వచ్ఛభారత్‌ నిర్వహణపై వ్యాసరచన పోటీలు

ABN , First Publish Date - 2022-02-20T04:48:34+05:30 IST

జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్వచ్ఛభారత్‌ నిర్వహణ తదితర అంశాలపై శనివారం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఆస్పతిలో పరిసరాల పరిశుబ్రత, శుభ్రత పై ఏఎన్‌ఎం శిక్షణలో ఉన్న విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

స్వచ్ఛభారత్‌ నిర్వహణపై వ్యాసరచన పోటీలు
విజేతలకు బహుమతులను అందిస్తున్న ఆస్పత్రి పర్యవేక్షకుడు వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో శ్రీనివాసరావు

ఖమ్మంకలెక్టరేట్‌, ఫిబ్రవరి19: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్వచ్ఛభారత్‌ నిర్వహణ తదితర అంశాలపై శనివారం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఆస్పతిలో పరిసరాల పరిశుబ్రత, శుభ్రత పై ఏఎన్‌ఎం శిక్షణలో ఉన్న విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆస్పత్రి పరిసరాలను పరిశుబ్రంగా ఉంచడంలో ప్రజలకు, ఇటు సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. పరిశుబ్రతను పాటిస్తే ఆరోగ్యవం తమైన జీవన విధానం ఉంటుందని అన్నారు. వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ప్రతిభను కనపరిచారు. అనంతరం మెదటి, ద్వీతీయ, తృతీయ బహుమతులనుల విద్యార్థు లకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ ఎంవో డాక్టర్‌ బి శ్రీనివాసరావు, వైద్యులు సురేష్‌, నర్సింగ్‌ సూపరిన్‌ టెండెంట్‌ డి సుగుణ, నందగిరి శ్రీను, శ్యామల, ఇందిరా, సఫియాభేగం, లావణ్య, వినయ్‌,  ఉపేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-20T04:48:34+05:30 IST