అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-11-07T23:08:42+05:30 IST

అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్‌ టి. శ్రీనివాసరావు అన్నారు. అవినీతి నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌ వి.పి గౌతమ్‌తో కలిసి సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అవిష్కరించారు.

అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు

ఖమ్మంకల్చరల్‌, నవంబరు7: అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్‌ టి. శ్రీనివాసరావు అన్నారు. అవినీతి నిర్మూలనపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్‌ వి.పి గౌతమ్‌తో కలిసి సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అవిష్కరించారు. లంచం ఇవ్వడం, తీసు కోవటం రెండూ నేరమే అన్నారు. పొరుగు వారి నుంచి ఏదీ ఆశించవద్దని తీసుకోవటం కంటే ఇవ్వటం ఎంతో మేలన్నారు. అనంతరం కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవ స్థానంలో ఉన్నామన్నారు. విధి నిర్వహణే ధ్యేయంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎస్‌ మధుసూధన్‌, కమ్మం మునిసిపల్‌ చైర్మన ఆదర్శ సురభి, న్యాయమూర్తులు, ఏసీపీ డీఎస్పీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:09:16+05:30 IST

Read more