విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , First Publish Date - 2022-10-15T05:06:10+05:30 IST

పాఠశాలల్లోని సీ గ్రేడ్‌ విద్యార్థుల బోధన పట్ల ప్రత్యే దృష్టిసారించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ యాదయ్య సూచించారు.

విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి
స్టాఫ్‌ మీటింగ్‌లో ఉపాద్యాయులతో మాట్లాడుతున్న డీఈవో

హెచ్‌ఎంలు, సీఆర్‌పీల సమావేశంలో డీఈవో యాదయ్య

మధిర, అక్టోబరు 14: పాఠశాలల్లోని సీ గ్రేడ్‌ విద్యార్థుల బోధన పట్ల ప్రత్యే దృష్టిసారించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌ యాదయ్య సూచించారు. శుక్రవారం మధిర ప్రభుత్వ ఉన్నత పాఠశాల(సీపీఎస్‌)లో నోడల్‌ అఽధికారి ప్రభుదయాల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, సీఆర్‌పీల సమావేశాన్ని డీఈవో ఆకస్మికంగా సందర్శించి పలు సూచలను చేశారు. ఈనెల 15 నుంచి 31 వరకు నిర్వహించే ప్రాథమిక పాఠశాలల మానిటరింగ్‌  ప్లానింగ్‌ వివరాలను నోడల్‌ అధికారి ప్రభుదయాల్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఉన్న 40 ప్రాఽథమిక పాఠశాలలను ఈనెల 31లోపు సందర్శించేలా తయారు చేసిన ప్రణాళికలను పరిశీలించారు. సమావేశంలో స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాద్యాయులు నారాయణ, విజయశ్రీ, భావ్‌సింగ్‌ పాల్గొన్నారు. 

పలు పాఠశాలలు సందర్శించిన డీఈవో:

మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను డీఈవో యాదయ్య ఎంఈవో ప్రభాకర్‌తో కలిసి సందర్శించారు. మహదేవపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం అమలుతీరును పరిశీలించారు. పదోతరగతి విద్యార్దులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరాచారి, ఎంఈవో ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-15T05:06:10+05:30 IST