వైరా ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

ABN , First Publish Date - 2022-09-18T04:58:18+05:30 IST

వైరా ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే రాములు నాయక్‌ ద్వితీయ కుమార్తె ఖమ్మం రెండో పట్టణ ఎక్సైజ్‌ సీఐ జయశ్రీ భర్త గుండెపోటుతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శనివారం రాత్రి కన్నుమూశారు.

వైరా ఎమ్మెల్యే ఇంట్లో విషాదం
భార్య, పిల్లలతో ప్రదీప్‌(ఫైల్‌)

గుండెపోటుతో రెండో కుమార్తె భర్త కన్నుమూత

వైరా, సెప్టెంబరు 17: వైరా ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే రాములు నాయక్‌ ద్వితీయ కుమార్తె ఖమ్మం రెండో పట్టణ ఎక్సైజ్‌ సీఐ జయశ్రీ భర్త గుండెపోటుతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో శనివారం రాత్రి కన్నుమూశారు. జయశ్రీ భర్త జూపల్లి ప్రదీప్‌(45) ఖమ్మం ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. గంత కొంతకాలంగా అనారోగ్యంతో బాఽధపడుతున్నారు. ఇందుకు సంబంధించి చికిత్స కూడా పొందుతున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుండగా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. జయశ్రీ, ప్రదీప్‌ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. కాగా జయశ్రీ సోదరుడు జీవన్‌లాల్‌ రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఈ విషయం తెలియగానే రాములు నాయక్‌, జీవన్‌లాల్‌ హుటాహుటిన ఖమ్మం బయలు దేరారు.

Read more