దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-06T23:37:49+05:30 IST

ళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్ధికంగా అభివృద్ది చెందాలని కలెక్టర్‌ వి.పి గౌతమ్‌ అన్నారు.

దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి
లబ్ధిదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌

చింతకాని డిసెంబరు 6: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్ధికంగా అభివృద్ది చెందాలని కలెక్టర్‌ వి.పి గౌతమ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రామకృష్ణాపురం, అనంతసాగర్‌లో దళితబంధు యూనిట్లను ఆయన పరిశీలించారు. జిరాక్స్‌, డీటీపీ సెంటర్‌, జేసీబీ, గొర్రెలు, టెంట్‌ హౌస్‌, కార్లు తదితర యూ నిట్లను పరిశీలించి లబ్ధిదారులతో ఆదాయ విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిట్లు రాక ముందు ఆర్ధిక పరిస్థితి, వచ్చిన అనంతరం పరిస్థితులపై ఆరా తీశారు. యూనిట్ల నిర్వహణ స్వయంగా చేసుకోవాలని, అప్పుడే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఆయా గ్రామాల్లో డా బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహాలు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కన్నెబోయిన కుటుంబరావు, నూతలపాటి మంగతాయమ్మ, ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి టి కిషన్‌రావు, బీసీ సంక్షేమ అధికారి జ్యోతి, సహకార అధికారి విజయకుమారి, పశుసంవర్థక అధికారి డా వేణు మనోహార్‌, జిల్లా వ్యవసాయ అధికారి బీ సరిత, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ మంగీలాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:37:50+05:30 IST