హత్యా రాజకీయాలకు సీపీఎం దూరం

ABN , First Publish Date - 2022-08-17T05:34:38+05:30 IST

హత్యారాజకీయాలకు సీపీఎం దూరంగా ఉంటుందని, తెల్దారుపల్లి కి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్య రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత కారణాల నే

హత్యా రాజకీయాలకు సీపీఎం దూరం

కృష్ణయ్య హత్యను ఖండించిన ఖమ్మంరూరల్‌ కమిటీ

ఖమ్మంరూరల్‌, ఆగస్టు 16 : హత్యారాజకీయాలకు సీపీఎం దూరంగా ఉంటుందని, తెల్దారుపల్లి కి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్య రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో జరిగిన హత్య అని, ఈ హత్యను ఖండిస్తున్నామని సీపీఎం ఖమ్మంరూరల్‌ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ మంగళవారం పేర్కొన్నారు. వరంగల్‌ క్రాస్‌రోడ్డులోని తమ్మినేని సుబ్బయ్య భవనలో మంగళవారం జరిగిన ఆ పార్టీ జనరల్‌బాడీ సమావేశంలో ప్రసాద్‌ మాట్లాడుతూ హత్యా  రాజకీయాల సంస్కృతి సీపీఎంది కాదని, కృష్ణయ్య హత్యకు, సీపీఎంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. వ్యక్తిగత తగాదాల వల్ల ఈ హత్య జరిగిందని, కానీ రాజకీయహత్య పేరుతో తెల్దారుపల్లి గ్రామంలోని తమ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి విలువైన వస్తువులను ధ్వంసంచేయడం, కార్యకర్తలను బెదరించడం, కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీసభ్యులు గుడవర్తి నాగేశ్వరరావు, యామిని ఉపేందర్‌, సుదర్శనరెడ్డి, బషీరుద్దీన, పి.సంగయ్య, నందిగామ కృష్ణ, మోహనరావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read more