TS News: బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్‌కు ఉంది: కూనంనేని

ABN , First Publish Date - 2022-12-10T13:49:41+05:30 IST

బీజేపీ (BJP)ని నిలువరించే సత్తా బీఆర్ఎస్‌ (BRS)కు ఉందని, భారత రాష్ట్ర సమితికి స్వాగతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) అన్నారు.

TS News: బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్‌కు ఉంది: కూనంనేని

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బీజేపీ (BJP)ని నిలువరించే సత్తా బీఆర్ఎస్‌ (BRS)కు ఉందని, భారత రాష్ట్ర సమితికి స్వాగతమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) అన్నారు. శనివారం ఆయన కొత్తగూడెం సీపీఐ (CPI) పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిందన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించవచ్చన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ కలలు కంటోందని.. కనీసం బీజేపీకి డబుల్ డిజిట్ కూడా రాదని అన్నారు. నరేంద్రమోదీని (Narendramodi), బీజేపీని ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్‌ (KCR)కు ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో మోదీ మోసపూరిత విధానాలు, పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. టిఆర్ఎస్‌తో పొత్తు కొనసాగిస్తూనే రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని కూనంనేని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-10T13:49:45+05:30 IST