ఇరు జిల్లాల్లో 14 మందికి కరోనా
ABN , First Publish Date - 2022-07-18T07:16:52+05:30 IST
ఇరు జిల్లాల్లో 14 మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూలై 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 550మందికి పరీక్షలు నిర్వహించగా 13 పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచవో డాక్టర్ మాలతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 54మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ నమోదైంది.