ఎనసీసీ-బీ సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి

ABN , First Publish Date - 2022-02-20T05:14:37+05:30 IST

11వ బెటాలియన ఎనసీసీ ఆధ్వర్యంలో బీ- సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. శనివారం జిల్లా పరిధిలోని రెండురోజులుగా నిర్వహిస్తున్న ఈపరీక్షలు మొదటిరోజు 265మంది ఎనసీసీ కేడర్‌ హాజరయ్యారు. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం విద్యార్థులు పాల్గొన్నా

ఎనసీసీ-బీ సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు పూర్తి

ఖమ్మం ఖానాపురంహవేలి, ఫిబ్రవరి19: 11వ బెటాలియన ఎనసీసీ ఆధ్వర్యంలో బీ- సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. శనివారం జిల్లా పరిధిలోని రెండురోజులుగా నిర్వహిస్తున్న ఈపరీక్షలు మొదటిరోజు 265మంది ఎనసీసీ కేడర్‌ హాజరయ్యారు. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం విద్యార్థులు పాల్గొన్నారు. ఈపరీక్షకు అధికారులుగా శశాంక్‌సరోడే, ఏవో జాకబ్‌ వ్యవహరించారు. పర్యవేక్షణ అధికారులుగా సుబేదార్‌ మేనేజర్‌ జితేందర్‌ వశిష్ట, సుబేదార్‌ పాండురంగ వాడేకర్‌, సుబేదార్‌ అర్జునమోరే వ్యవహరించారు. వివిధ కళాశాలలనుంచి ఏఎనవోస్‌లు కూడా పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి లెఫ్టినెట్‌ డాక్టర్‌ జర్పుల రమేష్‌ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. 

Read more