నిర్దేశించిన పనులన్నీ పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2022-06-07T06:26:54+05:30 IST

నిర్దేశించిన పనులన్నీ పూర్తిచేయాలి

నిర్దేశించిన పనులన్నీ పూర్తిచేయాలి
పట్టణప్రగతిలో భాగంగా రహదారి మరమ్మతు పనులు చేస్తున్న మంత్రి పువ్వాడ, మేయర్‌ నీరజ

పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి పువ్వాడ

నగరంలో పలు డివిజన్లలో పర్యటన

రఘునాథపాలెం మండలంలో ‘పల్లెప్రగతి’కి హాజరు

ఖమ్మంకార్పొరేషన/ రఘునాథపాలెం, జూన 6: పట్టణప్రగతిలో నిర్దేశించిన ప్రతీ పనిని పూర్తి చేయాలని, కార్యక్రమ నిర్వహణలో అధికారుల అలసత్వం చేయొద్దని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. 36, 50వ డివిజన్లలో కాలువల్లో మురుగు, చెత్త తొలగించే పనులను ప్రారంభించారు. గాంధీచౌక్‌ సెంటర్‌లో పారపట్టి రహదారి స్వయంగా మరమ్మతు పనుల్లో పాల్గొన్నారు. 16వ డివిజన పరిధిలోని లక్ష్మీగార్డెన్స ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రకృతివనాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని, కొన్ని డివిజన్లలో పనులు బాగా జరుగుతున్నాయని, మరికొన్ని డివిజన్లలో సక్రంగా జరగటంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణప్రగతిలో చేపట్టిన పనులు. సమస్యల పరిష్కారం, పురోగతి తదితర వివరాలను నగరపాలక సంస్థ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే 14,16,36,40, 41, 42, 45వ డివిజన్లలో నర్సరీలను పరిశీలించిన ఆయన వచ్చే హరితహారం కోసం లక్ష్యానికి మించి మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే రఘునాథపాలెం మండలం రేగులచెలక గ్రామంలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అజయ్‌ అభివృద్ధిపై అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకుని.. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కూడా అడిగారు. రేగులచెలకలో రూ.37లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 15 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధితో మురియాలని, పల్లెప్రగతి కార్యక్రమాన్ని అలసత్వం చేస్తే సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు పోటీపడాలని, రూ.కోట్లు తెచ్చిపెడుతున్నప్పుడు అభివృద్ధి అలసత్వం చేయకూడదని సూచించారు. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను గుర్తించాలని, వాటి ద్వారా చిన్నారులు, యువతకు మానసికోల్లాసంతోపాటు ఐక్యమత్యం పెంపొందుతుందన్నారు. ఖమ్మంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జోహారా, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, సహాయ కమిషనర్‌ మల్లీశ్వరి, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ రంజితకుమార్‌, డీసీసీబీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీప్రసన్న,  ఖమ్మం కార్పొరేటర్లు రాపర్తి శరతకుమార్‌, శీలంశెట్టి రమావీరభద్రం, మక్బూల్‌, బుర్రి వెంకటేశ్వర్లు, అర్బన తహసీల్దార్‌ ఎం.శైలజ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు గుండాల కృష్ణ, రేగులచలకలో చైర్మన కురాకుల నాగభూషణం, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, ఏంఎసీ చైర్మన లక్ష్మీప్రసన్న, వైస్‌చైర్మన వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, సర్పంచలు కొర్లపాటి రామారావు, మాధంశెట్టి హరిప్రసాద్‌, ఎంపీటీసీ సుజాత, ప్రదీప్‌, ఉపసర్పంచ వెంకటేశ్వర్లు, భాస్కర్‌, వీరునాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, వెంకటేశ్వర్లు, యండపల్లి సత్యం, వెంకట్‌, భిక్షమయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-07T06:26:54+05:30 IST