మధిర అటవీశాఖ అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-02-23T05:51:47+05:30 IST

మధిర అటవీశాఖ అధికారులు హరితహారం నర్సరీల్లోని మొక్కల పెంపకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పగిడిపల్లి నాగరాజు లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు.

మధిర అటవీశాఖ అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు

మధిరరూరల్‌, ఫిబ్రవరి22: మధిర అటవీశాఖ అధికారులు హరితహారం నర్సరీల్లోని మొక్కల పెంపకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పగిడిపల్లి నాగరాజు లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు.  ఫిర్యాదు చేసిన పత్రం చూపిస్తూ... మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సదరు ఫిర్యాదుదారుడు  నాలుగు సంవత్సరాలుగా అటవీశాఖలో టెక్నీకల్‌ అసి స్టెంట్‌గా కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్నాడు. తాజాగా ఆయన ఈ ఫిర్యాదు చేశారు. హరితహారం మొక్కల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. అయితే ఈ విషయంపై మధిర ఫారెస్ట్‌ రేంజర్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ హరితహారం మొక్కల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని తెలిపారు. నాగరాజు తమ శాఖలో కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్నాడని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మూడునెలల క్రితం ఉద్యోగం నుంచి తొలగించామన్నారు. ఈ కారణంతోనే అటవీశాఖపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. కార్యాల యం రికార్డులను తీసుకొని తన ఇంట్లో పెట్టుకున్నాడని దీనిపై టౌన్‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు.

Read more