పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం

ABN , First Publish Date - 2022-06-08T05:24:43+05:30 IST

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేర వని, ఫలితంగా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు.

పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం
ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికే పల్లెప్రగతి

కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ వెల్లడి

జడ్పీచైర్మన్‌తో కలిసి దుమ్ముగూడెంలో పల్లెప్రగతి పనుల పరిశీలన

దుమ్ముగూడెం, జూన్‌ 7: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేర వని, ఫలితంగా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని పెదనల్లబల్లి, చినబం డిరేవును జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య మంగళవారం సందర్శించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గతంలో చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాల వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చినబండిరేవులో రూ. ఐదులక్షలతో చేపట్టనున్న సీసీ రహదారి పను లతో పాటు, తాలిపేరు బ్యాంకింగ్‌పై మొక్క లు నాటే కార్య క్రమాన్ని ప్రారంభించారు. చినబండిరేవు డబుల్‌బెడ్‌రూం లబ్ధిదారులు తాగు నీటి సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్‌బెడ్‌ రూంలు ప్రారం భోత్సవం జరిగే వరకూ లబ్ధిదారులు ఇళ్లను పరిరక్షించుకోవాలన్నారు. చినబం డిరేవు పల్లెప్రకృతి వనంలో మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో వేసిన చిన్న గుడిశెలో కొంతసేపు సేదతీరి, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రకృతి వనాలన్నింటిలో గుడిసెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. గ డ్డోరుగట్ట గ్రామస్థులు తాగునీటితోపాటు పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తేగా, పరిష్కరించాలని సంబందితశాఖ అధికారులను ఆదేశించారు. అనం తరం పెదనల్లబల్లి పల్లెప్రగతి సభలో పాల్గొని మాట్లాడారు. స్థానిక సమస్యల ను గుర్తించి పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాము లవ్వాలన్నారు. చినబండిరేవు పీహెచ్‌సీ నుంచి సర్పంచ్‌ ఇంటివరకు సీసీ రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల నిర్వాహ ణలో అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు. తూరు బాకలో పల్లెప్ర కృతి వనాన్ని జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జయమ్మ, వెంకటేశ్వరావు, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ సీతమ్మ, స్పెషల్‌ ఆఫీసర్‌ చంద్రప్రకాశ్‌, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో చంద్రమౌ ళి, ఎంపీవో ముత్యాలరావు, డీఈ హరీష్‌, ఏఈ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు డా. తెల్లం వెంకట్రావు, అన్నె సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T05:24:43+05:30 IST