విద్యతోపాటు స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలి

ABN , First Publish Date - 2022-07-06T04:41:17+05:30 IST

పాఠశాలల్లో విద్యాభోదనతోపాటు స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యత నివ్వా లని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు.

విద్యతోపాటు స్వచ్ఛతకు ప్రాధాన్యమివ్వాలి
అవార్డులనందజేస్తున్న కలెక్టర్‌

అవార్డుల ప్రదానంలో కలెక్టర్‌ అనుదీప్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌, జూలై 5: పాఠశాలల్లో విద్యాభోదనతోపాటు స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యత నివ్వా లని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ 2021-22 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్ర మంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పా ఠశాలల్లో తాగునీరు, పారిశుద్యం, పరిశుభ్రత పాటించ డం లో సమర్ధతను గుర్తిచేందుకే స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లాలో ఇట్టి అంశాలు పరిశీలనకు జిల్లా విద్యాశాఖ అధికారి నోడల్‌ అధికారిగా, మిషన్‌భగీరధ ఈఈ, జిల్లా వైద్యాధికారి, ముగురు సమర్ధ వంతమైన ఉపాధ్యాయులు, ఇద్దరు స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కమిటీ వేసి 3,4,5 స్టార్స్‌ వచ్చిన పాఠశాలల్లో ఎవాల్యుయేషన్‌ టీములు నియమించినట్లు వివరించారు. ఈ బృందం పాఠశాలలను సందర్శించి నీరు, పారిశుధ్యం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, యాజమాన్య పద్దతులు, నిర్వాహాణ, పిల్లల ప్రవర్తనలో మార్పులు, సామర్ధ్యాల పెంపు తదితర ఆరు అంశాలలో 59 ప్రశ్నలు తయారు చేసి పాఠశాలల సమర్థతను పరిశీలించి ఎస్‌వీపీ పోర్టర్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 1733 పాఠశా లల్లో 1672 పాఠశాలల ప్రధానో పాధ్యాయులు ఎస్‌వీపీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ నమోదు ప్రక్రియ పూర్తిచేశారన్నారు. ప్రధానోపాధ్యాయుల స్వీయ మూల్యాంకన ప్రక్రియ ద్వారా 5 స్టార్స్‌లో 59 పాఠశాలలు, 4స్టార్స్‌లో 361 ఆఠశాలలు, 3స్టార్స్‌లో 759 పాఠశాలలు,మిగిలిన 493 పాఠశాలలు 1,2 స్టార్స్‌లో గుర్తించినట్లు వివరించారు. ఈ ప్రక్రియ మొత్తం మార్చి 31 వరకు పూర్తి చేశామన్నారు. జిల్లా స్థాయిలో ఓవరాల్‌ గ్రేడ్‌లో 8 పాఠశాలలు రాష్ట్రస్థాయికి నామినేట్‌ అ యినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల్లో నా బడి అనే ఓనర్‌ షిప్‌ తీసుకోవడం వల్లే అవార్డులు సాధించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అవార్డులు సాధించి ఇతర పాఠ శాలల సిబ్బందికి అదర్శంగా నిలిచారన్నారు. ఈ ఏడాది స్వచ్చతపై మరింత ఫోకస్‌ పెట్టి స్వచ్చతకు మన పాఠ శాలలు ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం స్వచ్చ విద్యాలయ పురస్కారాలు సాధించిన పాఠశాలల ప్రఽధానో పాధ్యాయులను కలెక్టర్‌ శాలువా, మెమోంటో, ప్రశం సాపత్రాలతో ఘనంగా సన్మానించారు. అవార్డులు పొందిన వారిని కలెక్టర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ రామారావు, జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్‌ దయానందస్వామి, స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌ నోడల్‌ అధికారి సైదులు, కో-ఆర్డినేటర్‌ నాగరాజు శేఖర్‌, మిషన్‌ భగీరధ ఈఈ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-06T04:41:17+05:30 IST