కక్షీదారుల నమ్మకాన్ని చూరగొనాలి

ABN , First Publish Date - 2022-02-23T05:47:02+05:30 IST

మార్చి 12న జరగబోయే జాతీయ లోక్‌అదాలత్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి కక్షీదారులకు సత్వర న్యాయం అందించి వారి నమ్మకాన్ని చూరగొనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు.

కక్షీదారుల నమ్మకాన్ని చూరగొనాలి
మాట్లాడుతున్న చంద్రశేఖరప్రసాద్‌

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌

ఖమ్మంలీగల్‌ ఫిబ్రవరి22: మార్చి 12న జరగబోయే జాతీయ లోక్‌అదాలత్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి కక్షీదారులకు సత్వర న్యాయం అందించి వారి నమ్మకాన్ని చూరగొనాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ అన్నారు. మంగళవారం  న్యాయ సేవాసదన్‌లో లోక్‌ అదాలత్‌ సన్నాహక చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత లోక్‌ అదాలత్‌ కంటే ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని పిలుపు నిచ్చారు. రాజీపడినప్పుడు తీసుకోవల్సిన అనుమతులను ముందే సిద్ధం చేసుకుని ఉండాలని పబ్లిక్‌ ప్రాసిక్యూ టర్లను ఆదేశించారు. న్యాయసేవాసంస్ధ కార్యదర్శి ఎం.ఏ జావీద్‌పాషా మాట్లాడుతూ రేపటి నుండే లోక్‌ అదాలత్‌ పరిష్కార నిమిత్తం ముందస్తు లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ కేసులను పరిష్కరించాలని సూచించారు. ఖమ్మం పోలీసు కమీషనర్‌ విష్ణు వారియర్‌, కొత్తగూడెం పోలీసు సూపరింటెండెంట్‌ సునిల్‌దత్‌ మాట్లాడుతూ ప్రతీ పోలీసుస్టేషన్‌ నుంచి ప్రత్యేక కమిటీలు నియమించి కేసుల రాజీకి సహకరిస్తామని హమీఇచ్చారు. ఈ కార్యక్ర మంలో న్యాయమూర్తులు అఫ్రోజ్‌ అక్తర్‌, ఆర్‌. డేనీరూత్‌, కె.అరుణకుమారి, అనితారెడ్డి, శాంతిసోని, హైమ పూజిత భారతి, ఎం.శ్యాంశ్రీ, ఓ. శ్రీనివాస్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు బి.కృష్ణమోహన్‌రావు, నర్సయ్య,   పాల్గొన్నారు. 

Read more