నేటి తరానికి ఆదర్శప్రాయుడు చేకూరి

ABN , First Publish Date - 2022-08-15T06:14:26+05:30 IST

నేటి తరానికి ఆదర్శప్రాయుడు చేకూరి

నేటి తరానికి ఆదర్శప్రాయుడు చేకూరి
కాశయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి

జిల్లాలో కాశయ్య ేసవలు మరువలేనివి

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద విగ్రహావిష్కరణ

ఖమ్మం ఖానాపురం హవేలీ, ఆగస్టు 14: ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ యవనికలో చేకూరి కాశయ్య అందరికీ ఆదర్శప్రాయుడని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మంనగర కమ్మ సంఘం ఆధ్వర్యంలో లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఏర్పాటు చేసిన చేకూరి కాశయ్య విగ్రహాన్ని మంత్రి అజయ్‌కుమార్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేకూరి కాశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. జిల్లాకు ఆయన చేసిన ేసవలు మరువలేనివని కొనియాడారు. రాజకీయాలలో విలువలు, సంప్రదాయాలను కడదాకా పాటించిన మహోన్నత వ్యక్తి అనిన్నారు. ప్రజలకు ేసవచేయడానికి ‘గురుదక్షిణ ఫౌండేషన్‌’ని స్థాపించారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ కూడా చాలాసార్లు కాశయ్య ేసవలను గుర్తుచేశారని మంత్రి తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ నాడు ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చేకూరి కాశయ్య పెద్ద దిక్కుగా ఉన్నారన్నారు. కమ్మ కల్యాణ మండపం నిర్మాణం, విద్యార్థ్థులకు హస్టల్‌ ఏర్పాటులో ఆయన కీలకంగా పని చేశారన్నారు. నిరాండబర జీవితానికి చేకూరి కాశయ్య పెట్టింది పేరన్నారు.  సుదీర్థకాలంలో రాజకీయాల్లో ఉన్నా తన పేరున సొంత కారు, ఇల్లు లేదని, ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. రైతుల పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల అవగాహన, విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న నాయకుడు కనుకనే ఈ రంగాల గురించి ఎక్కువగా పట్టించుకొని పని చేశారన్నారు. కార్యక్రమంలో, రాష్ట్ర విత్తనాభివృద్థి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్‌ నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగీరిరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, కేతినేని హరీష్‌ చంద్ర, వల్లభినేని రామారావు, బిక్కసాని దామోదర్‌ రావు, కర్నాటి కృష్ణ, బత్తుల మురళి, నాదెండ్ల కోటేశ్వరరావు, సరిపూడి సతీష్‌ కార్పొరేటర్లు, ఖమ్మం నగర కమ్మ సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-15T06:14:26+05:30 IST