చంద్రబాబుకు జననీరాజనం పలకాలి

ABN , First Publish Date - 2022-12-12T00:34:24+05:30 IST

ఈనెల 21న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా తరలొచ్చి అధినేత చంద్రబాబుకు జననీరాజనం పలకాలని, తెలంగాణలో పార్టీ పూర్వవైభవాన్ని నాంది పలకాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబుకు జననీరాజనం పలకాలి
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి

DSC_6372.jpgహాజరైన టీడీపీ నాయకులు

పార్టీ పునర్వైభవానికి ఖమ్మం సభ నాంది కావాలి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి

ఖమ్మం జిల్లా కార్యాలయంలో జనరల్‌బాడీ సమావేశం

ఖమ్మం మామిళ్లగూడెం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఈనెల 21న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా తరలొచ్చి అధినేత చంద్రబాబుకు జననీరాజనం పలకాలని, తెలంగాణలో పార్టీ పూర్వవైభవాన్ని నాంది పలకాలని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఖమ్మంలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన అభివృద్ధిని ఇంటింటికీ ప్రచారం చేసి ప్రజలను పార్టీవైపునకు మళ్లించాలన్నారు. భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల్లో టీడీపీ కీలకం కానుందని, ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజాకంటకపాలన సాగిస్తున్నారని, రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. వీటిని సాధించడం కోసం ఏమాత్రం ప్రయత్నించని సీఎం టీడీపీని నిర్మూలిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలోనూ, ఏపీలో చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆయనకు నీరాజనం పడుతున్నారన్నారు. కడప, కర్నూలు ఇతర బహిరంగ సభల్లోనూ పోటెత్తిన జనమే అందుకు నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా చంద్రబాబు నాయుడు అవసరాన్ని గుర్తించి టీడీపీకి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారని అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ టీడీపీకి పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, ఒకప్పుడు తెలంగాణ వాదాన్ని వినిపించిన టీఆర్‌ఎస్‌ మాట మార్చి బీఆర్‌ఎ్‌సగా మారిందన్నారు. 21న ఖమ్మంలో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు ఖమ్మంతో పాటు నల్లగొండ, మహాబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల నుంచి జనం తరలొచ్చేలా పార్లమెంట్‌ కమిటీలు బాధ్యత తీసుకోవాలన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించిన బయ్యారం ఉక్కు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌, ఏపీ అభివృధ్దికి నిధుల కేటాయింపు లాంటి అన్ని ప్రజోపకరమైన సమస్యలను సాధించడంలో టీడీపీ ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాధం, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహాబూబాబాద్‌, జిల్లాలకు చెందిన పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షులు, సభ్యులు నెల్లూరి దుర్గాప్రసాద్‌, కొండపల్లి రామచంద్రరావు, ఏఎస్‌ హరికృష్ణ, గుత్తా సీతయ్య, కేతినేని హరీష్‌, కనగాల సాంబశివరావు, కట్రం స్వామి దొర, అనంతరెడ్డి, మాధవీలత, ఎంపీపీ ఆరెం వరలక్ష్మీ, భూక్యా సునీత, చలసాని ఝాన్నీరాణి, వడ్డెం విజయ్‌, కొండబాల కరుణాకర్‌, చేతుల నాగేశ్వరావు, మందపల్లి రజని, పోటు సరస్వతి, ఆత్మకూరు స్వప్న, చుండూరి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు నేతలు కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

Updated Date - 2022-12-12T00:34:31+05:30 IST

Read more