టీఆర్ఎస్, వైఎస్ఆర్‌టీపీ నాయకులపై కేసులు నమోదు

ABN , First Publish Date - 2022-07-07T02:38:34+05:30 IST

సూర్యాపేట : హుజూర్ నగర్ మండలం లక్కవరంలో టీఆర్ఎస్, వైఎస్ఆర్‌టీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హుజూర్ నగర్‌లో ఈ నెల 5వ తేదీన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో రాష్ట్ర అధికార

టీఆర్ఎస్, వైఎస్ఆర్‌టీపీ నాయకులపై కేసులు నమోదు

సూర్యాపేట : హుజూర్ నగర్ మండలం లక్కవరంలో టీఆర్ఎస్, వైఎస్ఆర్‌టీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హుజూర్ నగర్‌లో ఈ నెల 5వ తేదీన వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై మఠంపల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్యతో పాటు మరికొందరు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టిఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్ 323,341,504,506 R/W 34 కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏపూరి సోమన్నపై  కేసు నమోదైంది. టిఆర్ఎస్ కార్యకర్త శరత్ ఫిర్యాదు మేరకు సోమన్న‌పై ఐపీసీ సెక్షన్ 294బి, 504,505(ii) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read more