హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడాది జైలు

ABN , First Publish Date - 2022-11-07T23:46:14+05:30 IST

అన్న భార్యపై కొడవలిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఏడాది శిక్షతో పాటు రూ.1000జరిమానా విధిస్తూ సోమవారం సత్తుపల్లి న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఏడాది జైలు

సత్తుపల్లిరూరల్‌, నవంబరు 7: అన్న భార్యపై కొడవలిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఏడాది శిక్షతో పాటు రూ.1000జరిమానా విధిస్తూ సోమవారం సత్తుపల్లి న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధిర మండలం మడిపల్లికి చెందిన ఏసుపోగు జయరాజు, ప్రకాశరావు అన్నాదమ్ములు. రెండేళ్ల క్రితం జయరాజుకు చెందిన గేదెలు అనారోగ్యంతో మృతిచెందగా వాటిని సోదరుడు ప్రకాశరావు చేతబడి చేయించి చంపించినట్లు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2020 జూలై 23న సోదరుడి భార్య అన్నపూర్ణమ్మపై కొడవలితో జయరాజు దాడి చేశాడు. దాడిలో ఆమె చెంప, మెడపై తీవ్రగాయాలవ్వగా భర్త ప్రకాశరావు సోదరుడు జయరాజుపై మధిర టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అదేరోజు ఫిర్యాదు చేశాడు. సత్తుపల్లి సబ్‌ కోర్టులో విచారణ జరగ్గా 11మంది సాక్షులను విచారించిన సీనియర్‌ సివిల్‌ జడ్జీ పీ.అరుణకుమారి ముద్దాయి జయరాజుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000జరిమానాగా విధించారు. అదనపు పీపీ వీరభద్రం వాదించగా పోలీసు సిబ్బంది బుద్దా శ్రీనివాస్‌, సత్యనారాయణ, కళింగరెడ్డిలు సహకరించారు.

Updated Date - 2022-11-07T23:46:14+05:30 IST

Read more