జేఏ పరీక్ష ఫలితాలకు అభ్యర్థులదే బాధ్యత

ABN , First Publish Date - 2022-09-13T06:51:47+05:30 IST

జేఏ పరీక్ష ఫలితాలకు అభ్యర్థులదే బాధ్యత

జేఏ పరీక్ష ఫలితాలకు అభ్యర్థులదే బాధ్యత

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై సింగరేణి యాజమాన్యం వివరణ 

ఇల్లెందు, సెప్టెంబరు 12: సింగరేణి కాలరీస్‌ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియమకాలకు సెప్టెంబరు 4న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాల్లో నలుగురు అభ్యర్థులు వారు ఆనలైనలో పేర్కొన్న సమాచారం మేరకే హాల్‌టిక్కెట్లు, ఫలితాలు ప్రకటించడం జరిగిందని సింగరేణి యజమాన్యం ప్రకటించింది. ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘పరీక్ష పరిహాసం’ శీర్షీకతో పరీక్ష ఫలితాల వెల్లడిలో రాషా్ట్రల పేర్లు ఇతర పొంతన లేని పేర్లను అభ్యర్థుల పేర్లుగా పేర్కొంటు మెరిట్‌ జాబితాను సింగరేణి యజమాన్యం ప్రకటించినట్లు వార్త కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సింగరేణి యజమాన్యం తన వివరణలో హాల్‌టిక్కెట్ల నెంబర్లు పేర్కొంటు వారి పేర్లు, చిరునామాలు, కేటగిరీలు వెల్లడించింది. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ నియమకాల ప్రక్రియలో దరఖాస్తు చేసిన అభ్యర్థులనుంచి ఎటువంటి హర్డ్‌ కాఫీ తీసుకోలేదని, అభ్యర్థులు ఆనలైనలో ఇచ్చిన వివరాల ప్రకారమే హాల్‌టిక్కెట్లు జారీ చేయడం జరిగిందని, అందుకు అభ్యర్థులే పూర్తి బాధ్యత వహించాలని యజమాన్యం స్పష్టం చేసింది. అభ్యర్థుల భవిష్యతను దృష్టిలో ఉంచుకొని వారిని రాతపరీక్షకు అనుమతించామని సింగరేణి కాలరీస్‌ జనరల్‌ మేనేజర్‌ వేల్ఫేర్‌ అండ్‌ ఆర్‌సీ కె.బసవయ్య వెల్లడించారు. 

Read more