నేటి ప్రజావాణి రద్దు

ABN , First Publish Date - 2022-01-03T06:24:12+05:30 IST

నేడు, ఈనెల 10వ తేదీల్లో నిర్వహించనున్న ప్రజావాణి (గ్రీవెన్స్‌)ని రద్దుచేస్తున్నట్లు కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు.

నేటి ప్రజావాణి రద్దు

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి2: నేడు, ఈనెల 10వ తేదీల్లో నిర్వహించనున్న ప్రజావాణి (గ్రీవెన్స్‌)ని రద్దుచేస్తున్నట్లు  కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో జన సమూహాలు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ఈనెల 3, 10వ తేదీల్లో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్‌డేను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్‌ గౌతమ్‌ ఒక ప్రకటనలో కోరారు.

Read more