5వ తేదీ నాటికి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-11-25T00:21:31+05:30 IST

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో డిసెంబరు 5వ తేదీ వరకు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు.

5వ తేదీ నాటికి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కొత్తగూడెం కలెక్టరేట్‌, నవంబరు 24: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో డిసెంబరు 5వ తేదీ వరకు తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో రెవెన్యూ అధికారులతో వీడయో కాన్ఫరెన్సు ద్వారా బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ప్రత్యేక ఓటు నమోదు, ధరణి, రెండు పడక గదుల ఇళ్ల నిరాణాలు, లబ్దిదారులు ఎంపిక, జిఓ 76, పోడు సర్వే తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ క్రీడా ప్రాంగణా ఏర్పాటుపై ప్రతి రోజు తనకు నివేదిక అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈనెల 26,27 తేదీలతో పాటు డిసెంబరు 3,4 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. జిల్లాలో 110 బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 71 మాత్రమేఏర్పాటు చేశారని, మిగిలిన వాటికి భూమిని గుర్తించి ఎంపీడీవోలకు అప్పగించాలన్నారు. పోడు సర్వే ప్రస్తావిస్తూ 400 దరఖాస్తులు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. దరఖాస్తుల పరిశీలనతో పాటు ప్రత్యామ్నాయంగా లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించి జాబితాను డివిజన్‌స్థాయి కమిటీకి సిఫారస్‌ చేయాలన్నారు. విచారణ పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు, 300 వరకు గ్రామసభలు నిర్వహించాల్సి ఉందని తక్షణమే పూర్తి చేయాలన్నారు. జీఓ నెం 76 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తులు విచారణ వేగవంతం చేయాలన్నారు. రెండు పడక గదులకు లబ్దిదారుల ఎంపికను గ్రామ సభలు నిర్వహించాలన్నారు. నిర్మాణదళో ఉన్న ఇళ్లు జనవరి 15 వరకు పూర్తి చేయాలని, ప్రత్యామ్నాయంగా లబ్దిదారుల ఎంపిక జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ కె వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ మధుసూఽధన్‌రాజు, డీఆర్‌ఓ అశోక్‌చక్రవర్తి, డీపీఓ రమాకాంత్‌, ఆర్డీలోలు స్వర్ణలత, రత్నకళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

అడవుల పరిరక్షణలో ఆయన సేవలు అమూల్యం

సంతాప సభలో కలెక్టర్‌ అనుదీప్‌

మానవాళి మనుగడకు చెట్లు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొంటాయని, వాటి పరిరక్షరణలో ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివా్‌సరావు సేవలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం గుత్తికోయల చేతిలో మృతి చెందిన రేంజర్‌ శ్రీనివాసరావు సంతాపసభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. విధి నిర్వాహాణలో అంకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోవడం భాదాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతంచేకూరాలని కోరారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ మధుసూధన్‌రాజు, డీఆర్వో అశోక్‌చక్రవర్తి, ఏవో గన్యా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు దిశ సమావేశం: కలెక్టర్‌

ఈనెల 26న కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్‌ మలోత్‌ కవిత అధ్యక్షుత దిశ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు.

అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలన్నారు. ఈ సమావేశానికి దిశా కమిటీ వైస్‌ చైర్మన్‌ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, శాసనసభ్యులు, ఎంపీపీలతో పాటు దిశా కమిటీ సభ్యులు హజరు అవుతారన్నారు. .

Updated Date - 2022-11-25T00:21:39+05:30 IST