గులాబీదళంలో ‘బీఆర్‌ఎస్‌’ ఉత్సాహం

ABN , First Publish Date - 2022-12-10T01:18:53+05:30 IST

గులాబీ శ్రేణులు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రసమితిగా ఉన్న తమ పార్టీని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

గులాబీదళంలో ‘బీఆర్‌ఎస్‌’ ఉత్సాహం

జాతీయపార్టీ ఆవిర్భావానికి తరలిన ఉమ్మడి జిల్లా నేతలు

ఖమ్మంకార్పొరేషన, డిసెంబరు 9: గులాబీ శ్రేణులు కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రసమితిగా ఉన్న తమ పార్టీని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎ్‌స)గా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడిజిల్లా నుంచి పలువురు నేతలు తరలారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీలు నామ నాగేశ్వరరావు, మాలోత కవిత, వద్దిరాజు రవిచంద్రతో పాటు ఇరుజిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, నాయకులు హాజరయ్యారు.

చారిత్రక ఘట్టం : ఎంపీ నామ

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం దేశరాజకీయాల్లో మహోజ్వల చరిత్రాత్మక ఘట్టమని బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నవశకం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో మాదిరిగా దేశప్రజలకు సుపరిపాలన అందించే సత్తా కేవలం కేసీఆర్‌కు మాత్రమే ఉందని, ఆయన నిర్దేశకత్వంలో మరో నయాభారత నిర్మాణం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. కేసీఆర్‌ అడుగుజాడల్లో తాను ఒ సైనికుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

ఎంపీ నామపై సీఎం కేసీఆర్‌ ప్రశంసల జల్లు

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుపై సీఎం కేసీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. తాగునీటి విషయంలో చెన్నై నగరవాసులు పడుతున్న ఇబ్బందులను ఉటంకిస్తూ వాటర్‌బిల్లుపై ఎంపీ నామా నామ చేసిన ప్రసంగం పట్ల స్పందించిన సీఎం కేసీఆర్‌ నామ ఎంతో అద్భుతంగా మాట్లాడారని కితాబిచ్చారు.

Updated Date - 2022-12-10T01:18:53+05:30 IST