బీజేపీవి మాటలే.. చేతలు లేవు

ABN , First Publish Date - 2022-04-24T06:58:39+05:30 IST

బీజేపీవి మాటలే.. చేతలు లేవు

బీజేపీవి మాటలే.. చేతలు లేవు
విలేకరుల సమావేశంలో మట్లాడుతున్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన

నలుగురు ఎంపీలున్నా రాషా్ట్రనికి నిధులు తేలేకపోయారు

టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన

ఖమ్మం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీజేపీ నేతలవి మాటలేతప్ప చేతలు మాత్రం ఏమీ లేవని ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తాతా మదుసూదన ఎద్దేవా చేశారచు. ఆ పార్టీ నుంచి నలుగురు ఎంపీలు, ఒకరు కేంద్ర మంత్రిగా ఉండి రాషా్ట్రనికి ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తాతా మదుసూదన మాట్లాడారు. ఖమ్మంలో సాయిగణేష్‌ ఆత్మహత్య సంఘటను టీఆర్‌ఎస్‌ అందరికంటే ముందే ఖండించి, ఈ ఘటనపై ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించినా బీజేపీ నేతలు మాత్రం ఖమ్మం నుంచి ఢిల్లీ వరకు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కేవలం అబద్దాలతోనే బీజేపీ నేతలు పాదయాత్రలు, పర్యటనలు సాగిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్కపైసా ఇవ్వకపోయినా బీజేపీ ఎంపీలు ఎందుకు నిలదీయడంలేదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఒక్కరిపై కేసుపెట్టే అధికారం పోలీసులకు ఉంటుందన్నారు. సాయిగణేష్‌ కూడా ఖమ్మంలో చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాల వల్లనే పోలీసులు కేసులు పెట్టారని తెలిపారు. అతడు సొంత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆరోపణలు చేయడం తగదన్నారు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఆర్‌ఎ్‌సఎస్‌ నుంచి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు రేవంతరెడ్డి, జగ్గారెడ్డి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌, ఖమ్మం జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం, ఖమ్మం మేయర్‌ పునుకొల్ల నీరజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-24T06:58:39+05:30 IST