లిక్కర్‌ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఆందోళనలు

ABN , First Publish Date - 2022-12-06T23:11:45+05:30 IST

సీఎం కేసీఆర్‌ తన కుమార్తె కవిత లిక్కర్‌ స్కాంలో చిక్కుకోగా ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సింగరేణి బ్లాక్‌లను ప్రధాని మోదీ ప్రైవేట్‌ ప రం చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు సాగిస్తూ... అన వసర అందోళనలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు జంపన సీతారామరాజు అరోపించారు.

లిక్కర్‌ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఆందోళనలు
మాట్లాడుతున్న సీతారామరాజు

మణుగూరు, డిసెంబరు 6: సీఎం కేసీఆర్‌ తన కుమార్తె కవిత లిక్కర్‌ స్కాంలో చిక్కుకోగా ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సింగరేణి బ్లాక్‌లను ప్రధాని మోదీ ప్రైవేట్‌ ప రం చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు సాగిస్తూ... అన వసర అందోళనలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు జంపన సీతారామరాజు అరోపించారు. మంగళవారం మణు గూరు పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నాయ కులపై ప్రధాని మోదీపై లేనిపోని అభాండాలు మోపుతూ దిష్టిబొమ్మలను దహనం చేశారన్నారు. దిష్టిబొమ్మకు కాషా య వస్త్రాలను తొడిగి దహనం చేయడం హిందూవుల మ నోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహారించారని ఆవేధన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వ దిష్టి బొమ్మలను తగలబెట్టే ప్రయత్నాలు చేయబోతే మార్గమధ్యలో అడ్డుకుని వాటిని తమ నుంచి తీసుకుని పోతున్నారని, నాయకులను, కార్యకర్త లను స్టేషన్‌లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుశాఖా అధికారులకు బీజేపీ తరుపున తాను విజ్ఞప్తి చేస్తున్నానని ... ఇలా వ్యవహారించే పోలీసులు అధికారులు, సిబ్బంది తమ ఉద్యోగాలకు స్వస్తి పలికి కార్యకర్తల్లా టీఆర్‌ఎస్‌ బాట పట్టాలన్నారు. ఈ సమావేశం లో నాయకులు వీసాల దుర్గారావు, మెరుగు రవిందర్‌, నాగ శేషు, కుంజా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:11:48+05:30 IST