ఘనంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-04T04:44:29+05:30 IST

సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరా న్నంటాయి. సోమవారం మధిర, వైరా, సత్తుపల్లి నియోజ కవర్గాల్లోని ప్రధాన పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి ప్రదర్శనగా చె రువుల వద్దకు వెళ్లారు.

ఘనంగా సద్దుల బతుకమ్మ
కొణిజర్లలో బతుకమ్మను ఆడుతున్న మహిళలు

నెట్‌వర్క్‌: సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరా న్నంటాయి. సోమవారం మధిర, వైరా, సత్తుపల్లి నియోజ కవర్గాల్లోని ప్రధాన పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి ప్రదర్శనగా చె రువుల వద్దకు వెళ్లారు. అనంతరం వాటి చుట్టూ చేరి పా టలు పాడుతూ నృత్యాలు చేశారు. పోయిరా గౌరమ్మ.. పో యిరావమ్మా అంటూ నిమజ్జనం చేశారు. సత్తుపల్లి, వేం సూరులో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ముఖ్యంగా సత్తుపల్లిలో నలభై అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుక మ్మలను ట్రాక్టర్‌పై ఏర్పాటు చేయగా, ఆ వాహనాన్ని స్వయంగా తోలుకుంటూ వెళ్లి వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆయన వెంట మునిసిపల్‌ చైర్మన్‌ మహేష్‌, కమిషనర్‌ సుజాత, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు కళాకారులు దేవతామూర్తుల వేషధారణలో చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకు న్నాయి. మధిరలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.


Read more