బ్యాంకులకు కార్పొరేట్‌ శక్తులు ఎగనామం

ABN , First Publish Date - 2022-07-06T05:11:25+05:30 IST

బ్యాంకులు కార్పొరేట్‌ శక్తులు రూ.20లక్షల కోట్లు ఎగనామం పెట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు.

బ్యాంకులకు కార్పొరేట్‌ శక్తులు ఎగనామం
మాట్లాడుతున్న హేమంతరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం  

కామేపల్లి, జులై 5: బ్యాంకులు కార్పొరేట్‌ శక్తులు రూ.20లక్షల కోట్లు ఎగనామం పెట్టాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. మంగళవారం ఊట్కూర్‌లో ఏపూరిలతాదేవి అధ్యక్షతన  జరిగిన మండల మహాసభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం వేసి కార్పొరేట్‌కు వత్తాసు పలుకుతున్నరని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్య దర్శి పోటు ప్రసాద్‌, పోటు కళావతి, తాటి వెంకటేశ్వర్లు, ఏపూరి బ్రభ్‌మం, ఏపూరిలతాదేవి, పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పుచ్చకాయల క్రిష్ణ పాల్గొన్నారు. 


Read more