బండి సంజయ్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ABN , First Publish Date - 2022-05-30T05:32:56+05:30 IST

హిందుత్వ ఏజెండాతో, మైనార్టీలే లక్ష్యంగా బీజేపీ కుల మత రాజకీయాలు చేస్తోందని బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు.

బండి సంజయ్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం
మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

బీజేపీయేతర రాజకీయ పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు

ఖమ్మంసంక్షేమవిభాగం,మే29: హిందుత్వ ఏజెండాతో, మైనార్టీలే లక్ష్యంగా బీజేపీ కుల మత రాజకీయాలు చేస్తోందని బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులు ఆరోపించారు. శనివారం ఖమ్మం సుందరయ్య భవన్‌లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వై విక్రమ్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. సీపీఎం, ప్రజాపంథా జిల్లా కార్యదర్శిలు నున్నా నాగేశ్వరరావు, గోకినపల్లి వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు కమర్తపు మురళీ, ఎన్డీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, పలు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు.  మసీదులపై బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగా చేశారన్నారు. దీనిపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు పాల్పడిన ప్రతి సారి ఇటువంటి హిందుత్వ రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చి 80శాతం ఉన్న హిందువుల ఓట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మత రాజకీయాలకు వ్యతిరేకంగా అంద రూ ఒకతాటిపైకి వచ్చి కలిసి ఉద్యమాలు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీయేతర రాజకీయ పార్టీల నాయకులు అఫ్రోజ్‌సమీనా, నవీన్‌రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, ముస్తాఫా, తాటి వెంకటేశ్వర్లు, ఐవీ రమణారావు, బజ్బార్‌, డాక్టర్‌ భారవి పాల్గొన్నారు.దాడులను ప్రజాస్వామ్యవాదులు, మేథావులు, లౌకికతత్వ వాదులు ఎదురించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-05-30T05:32:56+05:30 IST