సత్ఫలితాలిస్తున్న బడిబాట

ABN , First Publish Date - 2022-06-08T05:27:00+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. పాల్వంచ కేటీపీఎస్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషి అందుకు ఉదాహరణ.

సత్ఫలితాలిస్తున్న బడిబాట
బైక్‌పై విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న సంగమేశ్వరరావు

పాల్వంచ రూరల్‌, జూన్‌ 7: ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. పాల్వంచ కేటీపీఎస్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం చేస్తున్న కృషి అందుకు ఉదాహరణ. బడిబాట ప్రారంభం నుంచే అ ధ్యాపక బృందం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. తమ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన ఉంటుం దని వారికి వివరించారు. ఈక్రమంలో మూడు రోజుల్లో ఏకంగా 35 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం పాఠశాలలో 150 మంది విద్యార్ధులు చదువుతున్నారని, ఆ సంఖ్యను 250కి పెంచుతామని హెచ్‌ఎం సంగమేశ్వరరావు, ఉపాధ్యాయుల బృందం చెబుతోంది.

Read more